మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే చాలామంది కొన్ని పనుల కోసం అక్కడక్కడ ఆధార్ కార్డులు, పాస్ ఫోటోలు ఇచ్చేస్తుంటారు. (ఫ్రతీకాత్మక చిత్రం )
వాటి ద్వారా కొందరు కేటుగాళ్లు సిమ్ కార్డులు తెచ్చుకుంటారనే విషయం చాలాసార్లు బయటపడింది. మనకు తెలియకుండానే మన పేరుతో ఫోన్ నంబర్లు ఉంటాయి.(ఫ్రతీకాత్మక చిత్రం )
కానీ మన పేరు మీద మొత్తం ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను టెలికాం విభాగం ప్రారంభించింది.(ఫ్రతీకాత్మక చిత్రం )
కొందరి పేర్ల మీద వాళ్లకు తెలియకుండానే నంబర్లు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఒక పోర్టల్‌ను ప్రారంభించామని విజయవాడ టెలికాం శాఖ అధికారులు వెల్లడించారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
ఈ మేరకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో మొబైల్ నంబరు, దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో ఆ వివరాలన్నీ వచ్చేస్తాయి.(ఫ్రతీకాత్మక చిత్రం )
వాటిలో అవసరం లేనివి, మనకు తెలియకుండానే ఉన్న నంబర్లను సెలక్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీని వల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ చెప్పొచ్చని తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
మొదట ఏపీ, తెలంగాణ సర్కిళ్లలో ఈ పోర్టల్ సేవలందిస్తుందని.. త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.(ఫ్రతీకాత్మక చిత్రం )




