Wimbledon : ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరిన టెన్నిస్ భామలు వీరే.. రౌండాఫ్16లో ఎవరితో ఆడతారంటే..!
వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్‌కు అత్యంత ఆదరణ ఉంటుంది. పురుషుల మ్యాచ్‌లకు ధీటుగా సాగే ఈ పోటీలకు ప్రేక్షకులు కూడా భారీగా తరలివస్తారు. ప్రస్తుతం ప్రీ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న వింబుల్డన్‌లో రౌండాఫ్ 16లో ఎవరెవరు తలపడనున్నారంటే...
వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రీ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నది. శుక్రవారం రాత్రి జరిగిన మూడో రౌండ్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించి 8 మంది ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వీరిలో ఎవరెవరు ఎవరితో ఆడనున్నారంటే.. (Instagram)
2/ 9
పోలాండ్‌కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్ ఇగ స్వైటెక్ నాలుగో రౌండ్లో బేగును 6-1, 6-0తో ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. 2020లో ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ ఛాంపియన్ అయిన స్వైటెక్ మరో టైటిల్‌పై కన్నేసింది. (Instagram)
3/ 9
ట్యునీషియాకు చెందిన ఓనస్ జెబూర్ మూడో రౌండ్లో 11వ సీడ్ ముగురుజపై గెలిచి ప్రీక్వార్టర్స్ చేరింది. రౌండ్ ఆఫ్ 16లో ఆమె ఇగ స్వైటెక్‌తో తలపడనున్నది. (Instagram)
4/ 9
అమెరికాకు చెందిన 23వ సీడ్ మాడిసన్ కీస్ మూడో రౌండ్లో 13వ ర్యాంకర్ మెర్టెన్స్‌ను ఓడించింది. (Instagram)
5/ 9
స్విట్జర్లాండ్‌కు చెందిన విక్టోరియా గొలోబిక్ మూడో రౌండ్లో బ్రెంగిల్ను ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో మాడిసన్ కీస్‌తో తలపడనున్నది. (Instagram)
6/ 9
వరల్డ్ నెంబర్ 2 అరీనా సబలెంక మూడో రౌండ్లో ఒసోరియో సెర్రేనో 6-0, 6-3 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నది. (Instagram)
7/ 9
కజకిస్తాన్‌కు చెందిన ఎలీనా రిబకీనా మూడో రౌండ్లో రోజర్స్‌పై 6-1, 6-4 తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరింది. వరల్డ్ నెంబర్ 2 సబలెంకతో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నది. (Instagram)
8/ 9
చెక్ రిపబ్లిక్కు చెందిన 8వ ర్యాంకర్ కరొలినా ప్లిస్కోవా మూడో రౌండ్లో మార్టినకోవాపై 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది. (Instagram)
9/ 9
రష్యాకు చెందిన దిమిత్రీవ శాంసోన మూడో రౌండ్లో స్టీఫెన్స్‌పై 6-2, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. కరోలినా ప్లిస్కోవాతో ప్రీక్వార్టర్ ఫైనల్లో తలపడనున్నది. (Instagram)