భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేశారు. లేటెస్ట్ గా గ్రౌండ్ లో సిక్సర్లు.. ఫోర్లతో రెచ్చిపోవాల్సిన మన కుర్ర బ్యాట్స్ మెన్ గుండెల్లో ప్రేమ అలజడి మొదలైంది. ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్.. ప్రేమ వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. (Photo Credit : INSTAGRAM)