భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇక, క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమాకు ఏదో తెలియని సంబంధం ఉంది.అవును..ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా ఉన్నారు.