ప్రెజెంట్ బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జూలై నుంచి నెల రోజుల పాటు గండిపేటలో ఈ సినిమా క్లైమాక్స్‌ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుసగా కొత్త కాంబినేషన్స్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. (Twitter/Photo)
గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్టు అభిమానులతో బాలయ్య కన్ఫామ్ చేసారు. గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించారు. (Twitter/Photo)
ఈ సినిమాకు ’రామారావు గారు’ టైటిల్ ప్రచారంలో ఉంది. చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా తర్వాత పట్టాలెక్కనుంది. ఇక బాలయ్య కూడా గోపిచంద్ మలినేని సినిమాతో పాటు అనిల్ రావిపూడి సినిమాను ఒకేసారి చేయనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
పైసా వసూల్ ఫ్లాప్ అయినా కూడా పూరీ అంటే బాలయ్యకు ఎనలేని యిష్టం. ఇందులో బాలయ్య యాక్టింగ్ అంటే ఆడియన్స్‌కు యిష్టం. అందుకే టీవీలో ఎప్పుడొచ్చినా రేటింగ్ కూడా బాగానే వస్తుంటుంది. తాజాగా పూరీ జగన్నాథ్.. బాలయ్యతో ఓ ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య కూడా పూరీతో సినిమా అంటే చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు. మరి చూడాలి. మరోసారి వీళ్ల కాంబినేషన్ కోసం బాలయ్య అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)
సింగీతం సినీ జైత్రయాత్రలో మరో మజీలీ ‘ఆదిత్య 369’. బాలకృష్ణ హీరోగా, భారతీయ తెరపై తొలి టైం మిషన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సీక్వెల్‌కు బాలయ్య కథను రెడీ చేసుకోవడంతో పాటు తన తనయుడుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో బాలయ్య తన తనయుడుతో కలిసి నటించబోతున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)