రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి. వాళ్లే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది. సుధీర్ అంటే వెంటనే మరో పేరు కూడా గుర్తొస్తుంది. అదే రష్మి గౌతమ్. ఈ ఇద్దరి మధ్య ఏం లేదని అందరికీ తెలుసు.. కానీ ఏదో ఉందనే భ్రమతోనే సుధీర్ కెరీర్ మారిపోయింది.
మరీ ముఖ్యంగా ఇమ్మూకు మరో అమ్మాయితో గానీ పెళ్లైతే చచ్చిపోతాను.. ఇష్టమైన వాళ్లకు మరొకరితో పెళ్లైతే తట్టుకోవడం కష్టం.. లైఫ్ అంతా మనం ఊహించుకున్న స్థానంలో మరొకరు వచ్చి చేరితే బతకలేం అంటూ వర్ష ఏడ్చేసింది. ఇది చూసి పక్కనే ఉన్న ఇమ్మాన్యుయేల్ షాక్ అయిపోయాడు. ఏదేమైనా ఈ ఇద్దరిపై జబర్దస్త్ దర్శకులు కూడా ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తుంది.