మనిషి జీవితంలో శృంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా మారాలన్నా.. వారి రిలేషన్ (Relation) రొమాంటిక్ గా ఆనందంగా కొనసాగాలన్నా శృంగారం(Sex) అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారు ఒకింత ఆందోళనకు గురవ్వడం సహజమే. ఈ రకమైన ఆందోళన(Anxious) కేవలం మహిళ(Women)ల్లోనే కాదు పురుషుల్లో(Men) కూడా ఉంటుంది. దీన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే ముందుగా భయాన్ని విడిచిపెట్టి, లోతైన శ్వాస తీసుకోండి. ఎందుకంటే, శృంగారం అనేది ఒక సహజమైన ప్రక్రియ. ఇది తప్పుపట్టాల్సిన ప్రక్రియ ఏమీ కాదు. మన శరీరానికి ఏది సరైనదో? అది ఏమి చేయాలో? ఆనందాన్ని ఎలా సాధించాలో? సహజంగానే దానికి తెలుస్తుంది. అంతేకాక, శృంగారానికి నియమ నిబంధనలు, ఇలాగే చేయాలన్న గైడ్లైన్స్ ఏమీ లేవు. అయితే, మొదటి సారి శృంగారం చేసే మందు కొన్ని విషయాలపై తప్పక అవగాహన పెంచుకోవాలి. ఈ విషయాలు మన భయాలు(Sexual Fear), అభద్రతాభావాలను వదిలించుకోవడానికి సహాయపడుతాయి.