#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం కరోనా విలయతాండవంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంAP స్థానిక సంస్థల ఎన్నికలుExplainer కరోనా విలయతాండవంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంAP స్థానిక సంస్థల ఎన్నికలుExplainer HOME » PHOTOGALLERY » LIFE-STYLE » FIBRE HEALTH BENEFITS WHAT ARE THE BEST SOURCES OF FIBRE WHICH FOOD ITEMS SHOULD BE ADDED TO YOUR DIET FOR FIBRE NK Fibre Benefits: ఫైబర్ వల్ల లాభమేంటి... శరీరానికి తగినంత ఫైబర్ కోసం ఏం తినాలి? Fibre Health Benefits: మన శరీరానికి విటమిన్లు, పోషకాలు ఎంత అవసరమో... ఫైబర్ (పీచు పదార్థం) కూడా అంతే అవసరం. అది లోపిస్తే నరకం కనిపిస్తుంది. ఏయే పదార్థాల్లో ఫైబర్ ఉంటుందో తెలుసుకుందాం. News18 Telugu | April 19, 2021, 2:49 PM IST 1/ 9 Best sources of Fibre: మన శరీరంలో వ్యవస్థలు సక్రమంగా పనిచెయ్యాలంటే... మనకు ఫైబర్ (పీచు పదార్థం) అత్యవసరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. అంతేకాదు... ఆకలిని కంట్రోల్ చేసి... బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఫైబర్ అనేది... మొక్కలు, పండ్ల నుంచీ వస్తుంది. ఇందులో రెండు రకాలుంటాయి. కరిగిపోయేది, కరగనిది. కరిగిపోయే ఫైబర్... మన శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కరగని ఫైబర్ శరీరంలో నిల్వ ఉన్నా... అన్ని వ్యవస్థల్నీ క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. ఐతే... బాడీలో ఫైబర్ తగ్గితే మాత్రం... మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఫైబర్ ఉండేలా చేసుకోవాలి. అది గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. మీరు గనక సరైన ఫైబర్ ఉండే ఆహారం పొందనట్లైతే... ఇప్పుడు దృష్టి పెట్టండి. కింది ఫైబర్ ఉండే ఆహారం తప్పక తీసుకోండి. (images credit - twitter) 2/ 9 Legumes (గింజలు, పప్పులు): ఇవి మన ఇళ్లలో, పోపుల డబ్బాలో ఉండేవే. వాటిలో ఫైబర్ ఎక్కువ. అందువల్ల మనం తినే రోజువారీ ఆహారంలో అవి ఉండేలా చేసుకోవాలి. అంతేకాదు వాటిలో ప్రోటీన్స్, ఐరన్, ఫొలేట్, విటమిన్స్, మాంగనీస్ ఉంటాయి. (image credit - twitter - AFP) 3/ 9 Whole grains (తృణ ధాన్యాలు): గోధుమలు, ఓట్స్, మొక్కజొన్న, బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ ఇవన్నీ ఫైబర్ బాగా ఉండేవే. అందువల్ల వీటిని మీ డైట్లో చేర్చుకోవాలి. (image credit - twitter) 4/ 9 Broccoli (బ్రకోలి): బ్రకోలీలో విటమిన్ సి, కాల్షియంతోపాటూ... ఫైబర్ కూడా ఎక్కువే. దీన్ని ఎక్కువగా ఉడికించకుండా తింటే ఇంకా మేలు. ఫలితంగా పోషకాలన్నీ బాడీకి అందుతాయి. (image credit - twitter) 5/ 9 Flax seeds (అవిసె గింజలు): వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. ఇవి తేలిగ్గా జీర్ణం అవ్వడమే కాదు... రుచిగా కూడా ఉంటాయి. వీటిని వేపుకొని తినవచ్చు. టైమ్ పాస్‌గా కూడా తినవచ్చు. (image credit - twitter) 6/ 9 Avocados (ఆవకాడో): ఆవకాడో పండ్లను సలాడ్స్, ఎగ్స్, టోస్ట్ ఇలా రకరకాలుగా మిక్స్ చేసి తినవచ్చు. అవి మంచి రుచిగా ఉండటమే కాదు... శరీరానికి మంచివి కూడా. మంచి ఫ్యాట్ అందిస్తాయి. ఒక కప్పు ఆవకాడోలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. (image credit - twitter) 7/ 9 Apples (యాపిల్స్): యాపిల్ అనేది రకరకాల సూక్ష్మక్రిములను హరిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. ఒక యాపిల్‌లో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది ధమనుల్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. (image credit - twitter) 8/ 9 Nuts (పప్పులు): జీడిపప్పు, బాదం, పిస్తా వంటి పప్పుల్లో మంచి ఫ్యాట్తోపాటూ... ఫైబర్ కూడా ఎక్కువే. పచ్చివి, డ్రై, రోస్ట్ చేసిన పప్పుల్ని తినవచ్చు. (image credit - twitter) 9/ 9 పై ఆహారాలన్నీ ఫైబర్ రిచ్ అయినప్పటికీ... వాటిని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఫైబర్ ఎక్కువైతే మాటిమాటికీ టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుంటే... ఆరోగ్యమే ఆరోగ్యం. (image credit - twitter) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.) తాజా వార్తలునా భర్త దుబాయిలో ఉన్నాడు...అనుకోకుండా మరిదితో ఆ రాత్రి మద్యం సేవించి....తప్పుజరిగిపోయింది...Sex Education: కండోమ్ లేకుండానే హెచ్ఐవీ సోకకుండా...సెక్స్ వర్కర్‌తో శృంగారం చేయొచ్చా..Nellore: ఆనందయ్య మందు తయారీని పరిశీలించిన ఆయుష్ శాఖ.. ఏం చెప్పారంటే..Toyota X-Prologue: త్వరలో టొయోటా మొదటి విద్యుత్ కారు ఎక్స్-ప్రోలాగ్ లాంఛ్.. ఫీచర్లు ఇవే.. Top Stories Nellore: ఆనందయ్య మందు తయారీని పరిశీలించిన ఆయుష్ శాఖ.. ఏం చెప్పారంటే.. Trains Cancelled: యాస్ తుపాను ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు.. Hyderabad : జూనియర్ డాక్టర్స్ నిరసన...నాలుగు రోజుల్లో విధుల బహిష్కరణ Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు Banana peel: అరటి తొక్కలను పారేస్తున్నారా... ఇకపై వాటిని ఇలా వాడేసుకోండి