A Blood Type Personality: A బ్లడ్ గ్రూపు వారు తెలివైన వారు. ఏం చేసినా శ్రద్ధతో చేస్తారు. సున్నితంగా (Sensitive) ఉంటారు. సాయం చేసేరకం. వీళ్లు చాలా నమ్మకంగా ఉంటారు. సహనం ఎక్కువ. శాంతిని కోరుకుంటారు. కొన్నిసార్లు అతి సున్నితం అవుతారు. అంటే... తమతోపాటూ సమాజం మొత్తం ఉన్నతంగా ఉండాలని అతిగా కోరుకుంటారు. వీళ్లకు రూల్స్ బ్రేక్ చెయ్యడం నచ్చదు. కచ్చితంగా ఫాలో అవుతారు. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటారు. ఏదైనా నిర్ణయానికి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఒకేసారి ఎక్కువ రకాల పనులు వీళ్లు చెయ్యలేరు. ప్రతీదీ శుభ్రంగా, సరైన చోట ఉండాలనుకుంటారు. ప్రతీదీ ప్లాన్ చేసుకుంటారు. ఏం చేసినా పూర్తి ఏకాగ్రతతో చేస్తారు. నిబద్ధతతో ఉంటారు. వీళ్లలో చాలా మందికి OCD (అతి శుభ్రత) సమస్య ఉంటుంది. బాగా ఒత్తిడికి లోనవుతారు. వీళ్లకు యుద్ధం నచ్చదు, గొడవలు నచ్చవు, కలిసిమెలిసి ఉంటారు. అభిప్రాయాలు, ఐడియాలు బాగా పంచుకుంటారు. A గ్రూప్ వాళ్లను మనం బాగా నమ్మొచ్చని కొందరు మానసిక వేత్తలు చెబుతున్నారు. జార్జి బుష్, హిట్లర్, జెట్ లీ, బ్రిట్నీ స్పియర్స్, రిచర్డ్ నిక్సన్ వంటి వారిది ఈ గ్రూపే. (image - britney spears - credit - instagram)