World of virus: కరోనా వైరస్ మన జీవితాలతో ఎలా చెడుగుడు ఆడుకుంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి ఈ భూమిపై ఎన్ని రకాల వైరస్లు ఉన్నాయో తెలుసా? 10 లక్షల రకాల వైరస్లు. ఇవన్నీ మనపై దాడి చెయ్యగలవు. కానీ... వీటిలో కొన్ని మాత్రమే దాడి చేస్తున్నాయి. మిగతావి దాడి చేసినా తట్టుకునేలా మన శరీరంలో ఇమ్యూనిటీ ఉంది. వీటిలో కొన్ని జంతువులు, పక్షులపై దాడి చేస్తాయి. 3,20,000 రకాల వైరస్లు జంతువులపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ భూమిపై మనుషులు, పక్షులు, జంతువుల కంటే ముందే వైరస్లు పుట్టాయి. అంటే మనం వైరస్లు ఉన్న ప్రపంచంలో ఉన్నాం. వైరస్లతోనే సహజీవనం చేస్తున్నాం. ఎప్పుడు ఏ వైరస్ మనపై దాడి చేస్తుందో చెప్పలేం. ఇప్పటికే సార్స్, మెర్స్, స్వైన్ ఫ్లూ, నిపా ఇలా చాలా దాడి చేశాయి. వాటిలో కరోనా ఒకటి మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)