China: జలాంతర్గాముల్లో (submarines) పనిచేసే వారు మానసిక అనారోగ్యం పాలవుతారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా మరో పరిశోధనలోనూ ఇదే తేలింది. దక్షిణ చైనా సముద్రంలో ఆపరేట్ అవుతున్న సబ్మెరైన్లలో పనిచేస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే అరుదైన విషయాన్ని కనుక్కున్నారు చైనా మిలిటరీ వర్శిటీ, నేవీ మిలిటరీ మెడికల్ వర్శిటీ పరిశోధకులు. ఈ విషయాన్ని బ్రిటీష్ జర్నల్ మిలిటరీ మెడిసిన్‌లో ప్రచురించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాల కంటే ఎక్కువగా... తీవ్రమైన మానసిక సమస్యలు సబ్‌మెరైన్‌లో పనిచేసేవారికి ఎదురవుతున్నాయని తేలింది. "దక్షిణ చైనా సముద్రంలో జలాంతర్గామి దళంలో ఉన్న సైనికులు, అధికారులు మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తొలిసారిగా ఈ అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది" అని పరిశోధకులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం - courtesy - twitter)
PLA నేవికి చెందిన సబ్మెరైన్లలో పనిచేసే 580 మంది పురుషులపై ఈ అధ్యయనాన్ని చేశారు. వీరంతా దక్షిణ చైనా సముద్రంలో ఆపరేట్ చేస్తున్న జలాంతర్గాముల్లో పనిచేస్తున్న సైనికులు. వీరిలో 511 మంది పూర్తి వివరాలు చెప్పారు. జలాంతార్గాముల్లో క్లిష్ట పరస్థితుల వల్ల వాటిలో పనిచేస్తున్న వారి మానసిక ఆరోగ్యం, PLA దళాల్లో ఉండే సైనికుల కంటే దయనీయంగా ఉంది. ముఖ్యంగా వారిలో ఆందోళన, భయం, మతిస్థిమితం, సోమటైజేషన్ లాంటి మానసిక సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ మానసిక ఇబ్బందులు.. శారీరక లక్షణాలతో పాటే కనిపిస్తున్నాయని రిపోర్ట్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం - courtesy - twitter)
దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు: ఈమధ్య దక్షిణ చైనా సముద్రం సైనిక ఉద్రిక్తతలకు కేరాఫ్ అయ్యింది. ఈ సముద్రంలో దాదాపు 13 లక్షల చదరుపు మైళ్ల వరకు తమకు చెందుతుందని బీజింగ్ ప్రభుత్వం వాదిస్తోంది. 2014 నుంచి మానవ నిర్మిత కృత్రిమ ద్వీపాలు, ఇసుక దిబ్బలు, క్షిపణి రన్ వేలను నిర్నిస్తోంది. అంతేకాకుండా ఆయుధ వ్యవస్థలను బలోపేతం చేసింది. ఆ దీవులు, ప్రభుత్వ చర్యల్ని అమెరికా ఖండిస్తోంది. చైనా దూకుడును ఆపేందుకు సముద్రంలో చైనా వైపుగా తమ యుద్ధ నౌకలు, సైనిక విమానాల్ని పంపుతోంది. వాటికి పోటీగా చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం - courtesy - twitter)
చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్ ప్రణాళికలు: వాషింగ్టన్‌కి చెందిన న్యూక్రియర్ థ్రెట్ ఇనిషియేటివ్ (NTI) నుంచి వచ్చిన 2019 నివేదిక ప్రకారం చైనాకు కనీసం 60 సబ్మెరైన్లు ఉన్నాయి. వాటిలో కనీసం 10 అణుశక్తితో పనిచేసేవి. సబ్‌మెరైన్ ప్రధానంగా కలిగిన ఓ నౌకా నిర్మాణం సగం పూర్తైంది. మార్చి 2020లో వచ్చిన కాంగ్రెస్ రిసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం... వచ్చే దశాబ్దకాలంలో PLA నేవీ.. న్యూక్లియర్ పవర్‌తో నడిచే నౌకల సంఖ్యను 16కు పెంచబోతోందని యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఛానల్ ఇంటిలిజెన్స్ అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం - courtesy - twitter)