Isabelle Eleanor: ఇసాబెల్లే ఎలెనార్... ఇన్స్టాగ్రామ్ మోడల్. తాజాగా ఈ అమ్మడు ఆస్ట్రేలియా ఎయిర్‌లైనర్ విమానం జెట్స్టార్లో ప్రయాణం చేయబోతుంటే... ఫ్లైట్ అటెండెంట్ ఆపేశారు. "నేనెవరో తెలుసా... నన్నే గుర్తు పట్టలేకపోతే ఎలా... ఇంకెందుకు మీకీ ఉద్యోగం" అంటూ ఆమె ఫైర్ అయ్యింది. (Photo Courtesy- isabelle.eleanore / Instagram)
ఫ్లైట్ అటెండెంట్ ఆమెను విమానం ఎక్కనివ్వకుండా ఆపేయడానికి ప్రధాన కారణం ఆమె వేసుకున్న టాప్ మరీ చిన్నదిగా ఉండటమేనని తెలిసింది. డ్రెస్ చిన్నగా ఉండటంతో... ఓవర్ ఎక్స్పోజింగ్ అవ్వడంతో... ఎందుకైనా మంచిదని ఆమెను విమానం ఎక్కనివ్వకుండా... పక్కకు పంపించారు. దాంతో తననే అడ్డుకుంటారా అని ఆమె ఇంతెత్తున లేచింది... కారణమేంటి... ఎందుకు ఆపేస్తున్నారు అని అడిగితే... ఇదీ విషయం అని చెప్పగా... ఆమె మరింత భగ్గుమంది. నా డ్రెస్ ఎలా ఉంటే మీకేంటి... నాకు లేని బాధ మీకేంటి అంటూ మరింత రెచ్చిపోయింది. (Photo Courtesy- isabelle.eleanore / Instagram)
ఆమె మోడల్ అన్న విషయం తెలిశాక... ఫ్లైట్ అటెండెంట్ ఆమెతో వాదన అనవసరం అని భావించారు. "మేడం మీరు జాకెట్ వేసుకోండి. అప్పుడే విమానం ఎక్కనిస్తాం" అని ఫ్లైట్ అటెండెంట్ చెప్పగా... "నా దగ్గర లేదు" అని ఆమె చెప్పింది. వెంటనే ఫ్లైట్ అటెండెంట్... తన టీమ్‌తో మాట్లాడి... కొత్త జాకెట్ ఒకటి తెప్పించారు. ఆ సమయంలో మోడల్ బ్లాక్ క్రాప్ టాప్, బ్లూ జీన్స్ వేసుకొని ఉంది. (Photo Courtesy- isabelle.eleanore / Instagram)