ఈ సంవత్సరం కరోనా నుంచి ప్రపంచం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి చివర్లో కరోనా జోరు తగ్గింది. కొత్త కేసులు, మరణాలూ మెల్లగా తగ్గుతున్నాయి. నిన్న ప్రపంచవ్యాప్తంగా 3,10,870 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. 2 వారాల కిందట ఈ సంఖ్య డబుల్ ఉండేది. మొత్తం కేసుల సంఖ్య 10.38 కోట్లు దాటింది. నిన్న 7,400 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 22.45 లక్షలు దాటింది. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. ప్రస్తుతం రికవరీ కేసులు 7.55 కోట్లు ఉండటంతో... యాక్టివ్ కేసులు 2.60 కోట్లు ఉన్నాయి. (image credit - twitter - reuters)
అమెరికాలో నిన్న 75,934 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 2.68 కోట్లు దాటాయి. నిన్న 1,194 మంది చనిపోవడంతో... మొత్తం మరణాలు 4.53 లక్షలు దాటాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత స్పెయిన్ (25,867) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, బ్రిటన్, రష్యా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్లో ఉండగా... బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (1,194) టాప్లో ఉండగా... జర్మనీ (619), బ్రెజిల్ (565), మెక్సికో (462), ఫ్రాన్స్ (455) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. (image credit - twitter - reuters)
ఇండియాలో కొత్తగా 11,427 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,07,57,610కి చేరింది. కొత్తగా 118 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,54,392కి చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. దేశంలో తాజాగా 11,858 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,04,34,983కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు దేశంలో 97 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 1,68,235 ఉన్నాయి. ఇప్పటివరకూ దేశంలో టెస్టులు 19.70 కోట్లు జరిగాయి. (image credit - twitter - reuters)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 17,686 టెస్టులు చెయ్యగా 118 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,94,587కి చేరింది. తాజాగా ఇద్దరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,601కి చేరింది. తాజాగా 264 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,90,894కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,092 ఉండగా... వీరిలో 723 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనాపరీక్షల సంఖ్య 78,79,047కి చేరింది. (image credit - twitter - reuters)
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 21,922 టెస్టులు చెయ్యగా... 64 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 8,87,900కి చేరింది. తాజాగా ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 7,154కి చేరింది. తాజాగా 99 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,79,504కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,242 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,31,59,749 టెస్టులు చేశారు. (image credit - twitter - reuters)