దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కఠిన ఆంక్షలు అమలు చేయనుంది. ఈ టైమ్ లో ఎవరు బయటకు వచ్చినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఐతే ఆంధ్రప్రదేశ్ లో నుంచి వేలాది మంది నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో వీరంతా ఆందోళన చెందుతున్నారు.
కర్ఫ్యూ టైమ్ లో హైదరాబాద్ చేరుకుంటే ఇళ్లకు ఎళా వెళ్లాలనే అంశంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐతే ఇలాంటి వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది.
కర్ఫ్యూ టైమ్ లో హైదరాబాద్ చేరుకుంటే ప్రయాణానికి సంబంధించిన టికెట్ చూపిస్తే ఇళ్లకు వెళ్లనిస్తామని పోలీసులు చెబుతున్నారు. వారని పికప్ చేసుకునేందుకు వెళ్లే వారు సైతం తమ బంధువులు, స్నేహితుల ప్రయాణానికి సంబంధించిన టికెట్స్ చూపిస్తే వదిలేస్తామని వివరణ ఇచ్చారు.




