Lord Hanuman Birth Place: తెలుగు నేలపైనే జన్మించిన ఆంజనేయుడు.. ఉగాది రోజు ప్రకటించనున్న టీటీడీ
Lord Hanuman: ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ ఐదు పురాణాలను, అనేక గ్రంథాలను పరిశీలించింది.
భక్తులు ఎంతగానో కొలిచే దైవం హనుమంతుడు ఎక్కడ జన్మించాడనే దానిపై అనేక కథలు ఉన్నాయి. ఆయన కర్ణాటకలోని ప్రాంతంలో పుట్టాడని కొందరు.. మరో చోట జన్మించాడని మరికొందరు చెబుతుంటారు. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 6
అయితే హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రి అనే ప్రచారం కూడా జరిగింది. ఈ అంశంపై అధ్యయనం కోసం టీటీడీ ఓ కమిటీని కూడా వేసింది.(ఫ్రతీకాత్మక చిత్రం )
3/ 6
హనుమాన్ జన్మస్థలం ఎక్కడనే ఆధారాల సేకరణకు గత డిసెంబరులో కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు అనేక పర్యాయాలు సమావేశమై చర్చించారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 6
ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు కమిటీ ఐదు పురాణాలను, అనేక గ్రంథాలను పరిశీలించింది.(ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 6
కమిటీ సూచనల మేరకు హనుమంతుడి జన్మస్థానం తిరుమల గిరుల్లోనే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారించింది. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానం అని టీటీడీ స్పష్టం చేసింది.(ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 6
ఈ అంశాన్ని ఈ నెల 13న ఉగాది రోజున అధికారికంగా ప్రకటించనుంది. ఆంజనేయుడి జన్మస్థలం తెలుగు గడ్డపైనే అని నిరూపించేందుకు అనేక పురాణ, శాస్త్రీయ ఆధారాలను టీటీడీ సిద్ధం చేసింది. వాటిని కూడా ఉగాది నాడు వెల్లడించబోతోంది.(ఫ్రతీకాత్మక చిత్రం )