మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ నెల 6న గురువు కుంభంలో ప్రవేశిస్తున్నందున ఉద్యోగపరంగా ఇంత వరకూ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశముంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, అధికారు వేధింపులు తగ్గి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉద్యోగం మానునుకునేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు. ఈ నెలంతా దాదాపు ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. శని సంచారం కారణంగా తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పను పూర్తవుతాయి. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. చాలావరకు అప్పు తీరుస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. సహోద్యోగులకు సహాయసహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. న్యాయ, పోలీస్, మిలటరీ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు దారితీస్తాయి.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) గురు గ్రహం కుంభంలోకి మారుతున్న కారణంగా ఉద్యోగంలో కొద్దిగా ప్రతికూలతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గడం, ఒత్తిడి పెరగడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, అదనంగా బాధ్యతలు మీద పడడం వంటివి జరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఖర్చు మాత్రం బాగా పెరుగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ స్థలం గానీ కొనుగోలుకు ప్రయత్నిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. స్త్రీతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి . ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీ ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యాపార, ఆధ్యాత్మిక, స్వయం ఉపాధి వంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కోర్టు కేసు అనుకూంగా వచ్చే సూచనలున్నాయి..
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) కుంభ రాశిలోకి గురు గ్రహం ప్రవేశిస్తున్న కారణంగా, ఆర్థిక లాభం, ఆకస్మిక ధనలాభం, రుణ బాధ నివృ త్తి వంటివి అనుభవానికి వస్తాయి.ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలు చోటుచేసుకుంటాయి. తీర్థయాత్రకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లో పెరుగుదల వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అష్టమంలో శని సంచారం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం వంటివి అనుభవానికి వస్తాయి. ఇంటా బయటా కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీపిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సంతృప్తిగా ఉండవు. సొంత నిర్ణయాలతో కుటుంబ సమస్యను పరిష్కరించుకోండి. ఎవరికీ హామీగా ఉండొద్దు.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఈ నెల 6న గురు గ్రహం కుంభ రాశిలోకి, అంటే మీకు అష్టమ రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా మిశ్రమ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆర్థికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలోను, వృత్తిలోనూ శ్రద్ధను, శ్రమను బాగా పెంచాల్సి ఉంటుంది. ఇక సప్తమంలో శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనుు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశముంది. తీర్థయాత్రకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం అన్ని విధాలా బాగుంది.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) మీకు సప్తమ రాశి అయిన కుంభ రాశిలోకి గురు గ్రహం ప్రవేశిస్తున్నందున వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ది ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొంటారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. శుభవార్త వింటారు. మొత్తానికి ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగ సంస్థలో కొత్త ప్రాజెక్టు చేతికి అందివస్తాయి. భార్యాపిల్లలు ఎంతగానో సహాయక సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడితే గానీ ప్రయోజనం ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యహారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) గురు గ్రహం మీకు కుంభ రాశిలోకి ప్రవేశించడం వృత్తి, వ్యాపారం, ఉద్యోగరంగాల వారికి కొద్దిగా చిక్కులు ఎదురవుతాయి. ఆదాయంలోను, లాభాల్లోనూ పెరుగుదల, ఎదుగుదల కనిపించవు. సమస్య పరిష్కారంలో కొద్దిగా ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కోర్టు కేసు వాయిదా పడుతుంది. మొత్తం మీద మీకు ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం పరవ లేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు గానీ, తీర్థయాత్రకు గానీ ప్రణాళిక వేసుకుంటారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారం అనుకూలంగా ఉంది. చిన్నవ్యాపారులు, రైతులకు అన్ని విధాలా బాగా కలిసి వచ్చేసమయం.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) మీకు అయిదవ రాశి అయిన కుంభంలోకి గురు గ్రహంప్రవేశిస్తున్నందున ఆర్థిక పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశముంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. తరచూ శివార్చన చేయించండి. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారంచేసే అవకాశముంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం వల్ల ఇబ్బందులుపడతారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి రంగాల వారు ప్రయోజనం పొందుతారు. సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసు వాయిదా పడుతుంది. స్త్రీతో అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి..
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఈ నె 6న గురువు కుంభం రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా ఆర్థిక సమస్యలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఇల్లుమారే ఆలోచన చేస్తారు. ఇల్లు గానీ, స్థలం గానీ కొనేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగ రీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు సంభవిస్తుంది. మొత్తం మీద జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందనుకోవచ్చు. తలపెట్టిన పనున్నీ దాదాపు పూర్తవుతాయి. అనుభవానికి వస్తాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి
ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యంగా సత్ఫలితాలు సాధిస్తారు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) గురు గ్రహం కుంభ రాశిలో ప్రవేశం వల సరికొత్త నిర్ణయాలు, ఆలోచనతో కార్యశూరులవుతారు. జీవితంలో సాహసాలకు ఒడి గడతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తుకు బాటు వేస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు, చేర్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి రెండు రోజులుండే సూచనలున్నాయి. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెరడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశముంది. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఐ.టి నిపుణులకు బాగుంటుంది.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)ఈ రాశివారికి గురువు రెండవ రాశిలోకి ప్రవేశిస్తున్నందున, కొద్దిగా ఆర్థిక సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు వంటివి చోటు చేసుకుంటాయి. సమాజంలో పలుకుబడి పెరగడానికి, పలుకుబడి ఉన్న వారితో పరిచయాలకు అవకాశముంది. ఏలినాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యు తలెత్తినా వైద్యుల సాయంతో బయటపడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. సైన్స్, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్కు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార రంగంలో లాభాలకు అవకాశముంది.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఈ నె 6 నుంచి గురు గ్రహం కుంభ రాశి సంచారం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలుచేస్తారు. ఆశ, ఆశయాలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగం మానే ఆలోచన పెట్టుకోవద్దు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడత యి. అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు హద్దు దాటుతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లు, వృత్తినిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) 12వ రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నందున, మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆస్పత్రి లేదా వైద్య ఖర్చులు పెరుగుతాయి.
అనారోగ్యాకు గురయ్యే అవకాశం ఉంది. శుభ కార్యాలు మీద భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు, ఆలోచన కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ, ఖర్చు కూడా పెరుగుతాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇతర స్త్రీతో పరిచయాలు ఏర్పడత యి. విద్యార్థు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. ఇంజనీర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కోర్టు కేసు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.