మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆదాయం, ఆరోగ్యం పరవా లేదు. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన, భక్తి భావం పెరుగుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. తిప్పట ఎక్కువగా ఉంటుంది.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. కుటుంబంతో శుభ కార్యంలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి సహాయక సహకారాలు లభిస్తాయి. డబ్బు జాగ్రత్త.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి పరవా లేదు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అప్పు తీరుస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పరవా లేదు.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) అద్దె ఇల్లు మారడం గానీ, కొత్త ఫ్లాట్ కొనడం గానీ జరగవచ్చు. వీసా సమస్య పరిష్కారమవుతుంది. కొద్దిగా రుణ బాధ పీడిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగానికి సంబంధించి ఆఫర్ అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) నిరుద్యోగుకు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. సొంతగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన కొలిక్కి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శ్రమకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఉద్యోగం మానేయాలన్న ఆలోచనను ప్రస్తుతానికి విరమించండి. గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు మాత్రం దూరంగా ఉండాలి. కుమారుడికి దూర ప్రాంతంలో ఉద్యోగం భిస్తుంది. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, మంచి కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. గ్రహస్థితి అన్నివిధాలా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది.