Horoscope: మనలో అందరికీ పిల్లలంటే, శిశువులంటే ఇష్టముంటుంది. వారితో ఆడుకుంటుంటే మన ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతాయి. వారి కల్మషం లేని నవ్వును చూసి మనసులో ఆనందం ఉరకలెత్తుతుంది. కొందరు వ్యక్తులు మాత్రం పిల్లలంటే చిరాకు పడతారు. పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక దూరం పెడతారు. అయితే, ఎక్కువ మంది మాత్రం దీనికి భిన్నంగా పిల్లలు ఎంత అల్లరి చేసినా స్వాగతిస్తారు. వారితో ఇట్టే కలిసిపోయి సరదాగా గడుపుతారు. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ అమితానందం పొందుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ 5 రాశులకు చెందిన వారు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి, వారిని జాగ్రత్తగా చూసుకోవటానికి ఇష్టపడతారు. ఆ రాశులేంటో ఓ లుక్కేయండి.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) కర్కాటక రాశికి చెందిన వారు తమ ప్రియమైన వారి పట్ట ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ రాశికి చెందిన వారు పిల్లలతో సరదాగా ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కాబట్టి, ఒక కాన్సర్ రాశి వారు ఎవరైనా పిల్లవాడిని కలుసుకుంటే, త్వరగా వారితో స్నేహం చేస్తారు. మీ ఇంట్లోగానీ, చుట్టుపక్కల గానీ ఈ రాశి వారు ఉంటే... ఇక మీ పిల్లలకు ప్రతి రోజూ పండగే.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) తుల రాశి వారు పిల్లలు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వీరు పిల్లల పట్ల అమితమైన ప్రేమ కలవారు. పిల్లలతో ఆడుకోవడానికి, సరదాగా గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తే ఈ రాశి వారు వారిని కంట్రోల్ చేయడంలో చక్కటి నేర్పరితనం చూపిస్తారు.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ధనస్సు రాశి వారు పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వీరు పిల్లలను నవ్వించే ఫన్నీ వ్యక్తులు. పిల్లలు కూడా ఈ రాశికి చెందిన వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. పిల్లల కల్మషం లేని నవ్వు చూసి అమితానందం పొందుతారు. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఇదే రాశివారు అయితే... ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.
మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) జెమిని రాశి వారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. వారు పిల్లలతో సరదాగా ఆడుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వారి పట్ల ఎక్కువ జాగ్రత్త వహిస్తూ, ఎల్లప్పుడూ సుఖంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. గిఫ్టులు, బొమ్మలు ఇస్తారు.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) కుంభ రాశి వారు పరోపకారులు. వారు ఎప్పుడూ ఇతరులను జాగ్రత్తగా చూసుకోవటానికి, వారి అవసరాలను తీర్చడానికి ఇష్టపడతారు. అంతేకాక, వీరు అందరికీ మంచి చేయటానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. చిన్న పిల్లలతో సరదాగా గడిపేటప్పుడు వీరు కూడా చిన్న పిల్లల్లా వ్యవహరిస్తూ, చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు.