తమకంటూ ఓ ఇల్లు ఉండాలని.. అందమైన ఆ పొదరింటిని తమ ఆకాంక్షలకు తగ్గట్టుగా అలంకరించుకొని కుటుంబంతో ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కేవలం సెంటిమెంట్ గానే కాదు.. ఇళ్లు, ఫ్లాట్స్ వంటివాటిని ఇన్వెస్ట్ మెంట్ గా భావించి కొనుగోలు చేసేవారు కూడా చాలామందే ఉంటారు. ఇవి మంచి లాభాలు ఆర్జించి పెడతాయి కూడా. వాటిని అద్దెకు ఇవ్వడం లేదా తిరిగి అమ్మడం వల్ల లాభాలను పొందే వీలుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
హిందూ ధర్మం ప్రకారం ప్రతి ముఖ్యమైన, మంచి విషయాన్ని జరపడానికి.. కొత్తవి ఏవైనా ప్రారంభించేందుకు ఓ మంచి ముహూర్తాన్ని చూసి దాని ప్రకారమే నిర్ణయిస్తారు. దీనివల్ల చేసే పనుల్లో విజయం దక్కడంతో పాటు ధన లాభం కూడా ఉంటుందట. అందుకే కొత్త ఇల్లును కొనడం, అందులోకి మీరు మారడం వంటివన్నీ మంచి ముహూర్తంలో జరగాలి. దీనివల్ల అన్ని మీరు అనుకున్నట్లుగా అవుతాయి.