Lakhmi's grace: పేదరికం పోయి... డబ్బు రావాలని ఎవరు కోరుకోరు... అప్పులు తీరిపోయి.. మనస్శాంతి ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఎంతో కష్టపడతారు. ఐతే... కష్టంతోపాటూ... తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అన్నీ ఉన్నా... అమ్మవారి కరుణ లేకపోతే... ఏం చేసినా వృథా అవుతుందని అంటున్నారు.
కొంత మందికి మంచి ఉద్యోగం ఉంటుంది, శాలరీ నెల నెలా వస్తుంది... కానీ చేతిలో ఎప్పుడూ డబ్బు కొరతే ఉంటుంది. స్నేహితుల్ని, తెలిసిన వాళ్లను అప్పులు అడుగుతూ ఇబ్బంది పడుతుంటారు. అవతలి వాళ్లు కూడా అప్పు ఇవ్వాలంటే అయిష్టంగా ఉంటారు. ఇదంతా ఓ రకమైన సమస్య. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే... డబ్బు కొరత లేకుండా ఉండాలంటే... ఇంట్లో రెండు ముఖ్యమైనవి ఉండాలని పండితులు చెబుతున్నారు.
Camphor: మీ పూజ గదిలో... కర్పూరం ఉండటం సహజం. ఈ రోజుల్లో చిన్న చిన్న బిళ్లల రూపంలో కర్పూరం లభిస్తోంది. చాలా మంది పూజ చేస్తూ... రెండు లేదా 3 కర్పూరం బిళ్లలను వెలిగించి... ఇష్టదైవానికి హారతి ఇస్తారు. ఐతే... అలా చేస్తూనే... ఓ కర్పూరం బిళ్లను మీ పర్సులో లేదా వాలెట్లో ఉంచాలని పండితులు చెబుతున్నారు. బిళ్ల కాకపోతే... చిన్న ప్యాకెట్ రూపంలో కర్పూరాన్ని ఉంచుకోమంటున్నారు. ఐతే... కర్పూరం గాలి తగిలితే కరిగిపోతూ ఉంటుంది. అది కరిగిపోయినప్పుడల్లా మళ్లీ కొత్తగా కర్పూరాన్ని వాలెట్లో ఉంచుకోవడం మర్చిపోవద్దు అంటున్నారు.
Coconut: కొబ్బరికాయలు కొనే షాపుకి వెళ్లినప్పుడు చాలా మంది పెద్ద కొబ్బరికాయ కావాలని అడుగుతుంటారు. షాపుల వాళ్లు 2 లేదా 3 రకాల సైజుల్లో వాటిని ఉంచి... ఒక్కో దానికీ ఒక్కో ధర చెబుతుంటారు. ఐతే... లక్ష్మీ దేవికి చిన్న కొబ్బరి కాయలంటే ఇష్టం. ఎంత చిన్నగా ఉంటే... అంతగా అమ్మకు అవి నచ్చుతాయట. అలాంటి చిన్న కాయల్ని శ్రీఫలం అంటారు. పూజ గదిలో చిన్న కొబ్బరికాయను ఉంచితే... అమ్మవారికి ఎంతో నచ్చుతుందట. ఆ తర్వాత ఎంతో ఆనందపడుతూ... కోరిన కోరికలు తీర్చుతుందని పండితులు చెబుతున్నారు. అలా ఉంచిన కొబ్బరికాయను పగలగొట్టి కూడా పూజ చెయ్యవచ్చు. లేదా కాయగానే ఉంచవచ్చు అని సూచిస్తున్నారు. (Photo Source: Collected) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)