వినడానికి వింతగా అనిపించినా అది నిజమే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు పుట్టిన రోజు కాబట్టి ఆయన ట్రెండింగ్ లో ఉండడం సహజమే. కానీ చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలే ఎక్కవగా పోస్టులు పెడుతుండడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండడమే తనకు ముఖ్యమన్నారు. కరోనాకు అంతా దూరంగా ఉండాలి అని ఆయన కోరారు.
మరోవైపు టీడీపీ నేతలు, అభిమానులు వరుస పోస్టులు పెడుతున్నారు. దీంతో #HBDCBN అనే హ్యాస్ ట్యాగ్ మోత మోగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి సైతం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించింది. హార్డ్ వర్క్, క్రమశిక్షణకు మారు పేరు అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
గతేడాది చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. సీఎం జగన్, మంత్రి కేటీఆర్ లు సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ ఏడాది వారు ఎలాంటి ట్వీట్లు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ప్రస్తుతం ట్టిట్టర్ లో #HBDCBN ట్రెండింగ్ లో ఉంటుంది అనుకుంటే.. దానికన్నే ఎక్కువగా #HBDTelugu420CBN ట్రెండ్ అవుతోంది. ఇదేం ట్వీట్ అనుకుంటున్నారా? ప్రస్తుతం ఈ ట్వీట్లు వెల్లువాలా వస్తున్నాయి.
విరామం లేకుండా ఈ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి. అయితే ఇదంతా వైసీపీ నేతల కుట్రని టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు మండిపడుతున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని ఇలా అవమానపరుస్తారా అంటూ తిరిగి ట్విట్టర్ ద్వారే కౌంటర్ ఇస్తున్నారు.
సాధారణంగా చంద్రబాబు అంటే అంత ఎత్తున లేచి పడే విజయ సాయి రెడ్డి సైతం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
కరోనా కారణంగా బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం పంపారు. 17 తర్వాత పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు అంటూ ట్వీట్ చేశారు. మళ్ళీ మీ'బ్రీఫ్ డు అవసరం లేదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.




