• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • DHANASRI FILMING HER DANCING VIDEO FOR INSTA REELS HER HUSBAND CHAHAL WATCHING FRM A GLASS DOOR JNK

Viral : భార్య ధనశ్రీ డ్యాన్స్.. చాహల్ ఏం చేస్తున్నాడో తెలుసా.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా రీల్స్ వీడియో?

Viral : భార్య ధనశ్రీ డ్యాన్స్.. చాహల్ ఏం చేస్తున్నాడో తెలుసా.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా రీల్స్ వీడియో?

భార్య డ్యాన్స్ చేస్తుంటే చాహల్ ఏం చేస్తున్నాడో చూడండి (PC: Instagram)

భార్య ధనశ్రీ డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుంటుంటే.. వెనుక నుంచి చాటుగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

  • Share this:
    టీమ్ ఇండియా (Team India) క్రికెటర్లు జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్నారు. టెస్టు జట్టు సభ్యులంతా ముంబైలోని గ్రాండ్ హయత్‌లో కఠినమైన క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక మిగిలిన క్రికెటర్లు అందరూ తమ ఇళ్లలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా (Corona) కేసులు పెరిగిపోతుండటంతో ఆయా ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో కూడా కఠిన మైన లాక్ డౌన్ ఆంక్షలు అమవులు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఎవ్వరూ బయటకు రావడం లేదు. క్రికెటర్లు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yazuvendra Chahal) ఐపీఎల్ (IPL 2021) అర్దాంతరంగా వాయదా పడటంతో ఇంటికి వెళ్లిపోయాడు. టెస్టు జట్టులో సభ్యుడు కాకపోవడంతో అతను ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతని భార్యతో కలసి ఆటపాటల్లో మునిగిపోయాడు. చాహల్ భార్య ధనశ్రీ (Dhanasree) మంచి ప్రొఫెషనల్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. పలు డ్యాన్సింగ్ వీడియోలతో పాటు, యూట్యూబ్‌లో కూడా చాలా ఫేమస్. ఆమెకు ముంబైలో ఒక డ్యాన్సింగ్ స్టుడియో కూడా ఉన్నది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) క్రమం తప్పకుండా డ్యాన్సింగ్ వీడియోలు పోస్టు చేస్తుంటుంది.

    తాజాగా ముంబైలోని తన ఇంటిలో డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకుంది. ఇందులో భర్త చాహల్ వెనుక గదిలో నుంచి చాటుగా గమనిస్తుండటం రికార్డు అయ్యింది. కుక్కలతో ఆడుకుంటూ భార్య చేస్తున్న డ్యాన్సులను చాహల్ చూస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య డ్యాన్స్‌ను అలా దొంగచాటుగా చూడాల్సిన అవసరం ఏముంది అంటూ నెటిజెన్లు తెగ ఆడుకుంటున్నారు. చాహల్ మాత్రం ఈ కామెంట్లు ఏమీ పట్టించుకోకుండా లవ్, నవ్వు ఎమోజీలు ఇచ్చాడు.





















    టీమ్ ఇండియా త్వరలో పరిమిత ఓవర్లు క్రికెట్ ఆడటానికి శ్రీలంక వెళ్లనున్నది. టెస్టు జట్టు ఇంగ్లాండ్‌లో ఉండగానే మరో జట్టును బీసీసీఐ శ్రీలంకకు పంపనున్నది. వైట్ బాల క్రికెట్‌లో స్పెషలిస్టు క్రికెటర్లతో కూడిన జట్టును శ్రీలంకకు పంపనున్నట్లు తెలుస్తున్నది. ఈ జట్టులో యజువేంద్ర చాహల్ కూడా ఉండే అవకాశం ఉన్నది. కాగా ఈ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉంటారని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు