• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • WARANGAL A BUS MADE AS BUS SHELTER IN CHELPUR OF BHUPALPALLY DISTRICT VS WGL

Bhupalapally RTC : ఇదో వెరైటీ ..ప్రయాణికుల కోసం బస్సునే ...!

Bhupalapally RTC : ఇదో వెరైటీ ..ప్రయాణికుల కోసం బస్సునే ...!

Bhupalapally :ప్రయాణికుల ఇబ్బందిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది తాత్కాలికంగా ఆర్టీసీబస్సునే ..బస్సుషెల్టర్ గా ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు బస్సులో వేచి ఉండి సేదతీరుతూ.. వారికి సంబందించిన బస్సురాగానే వెళ్లి పోతున్నారు.

Bhupalapally :ప్రయాణికుల ఇబ్బందిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది తాత్కాలికంగా ఆర్టీసీబస్సునే ..బస్సుషెల్టర్ గా ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు బస్సులో వేచి ఉండి సేదతీరుతూ.. వారికి సంబందించిన బస్సురాగానే వెళ్లి పోతున్నారు.

  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తర్వాత చేపట్టిన సంస్కరణలతో ఆర్టీసీ ఉద్యోగుల్లో చాల మార్పులు వచ్చాయి..సమ్మెకు ముందు తాము కూడ సగటు ప్రభుత్వ ఉద్యోగులమే అన్నట్టుగా వ్యవహరించిన అధికారులు, సమ్మె అనంతరం జరిగిన పరిణామాల తర్వాత వారిలో మార్పు వచ్చింది. దీంతో తమ సంస్థను కాపాడుకునేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారు.. ప్రైవేటు వాహానాల్లో ప్రయాణికులు వెళ్లకుండా వీలైనన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఏది ఎక్కడ అవసరం అనుకంటే అప్పుడు బస్సులను కేటాయిస్తున్నార.

ఈ నేపథ్యంలోనే బస్సులను ఇప్పటికే కార్గో సర్వీసులుగా మార్చిన అధికారులు, బయో టాయిలెట్స్ కోసం కూడ పాత బస్సులను ఉపయోగిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు ఓ వినూత్న నిర్ణయాన్ని భూపాలపల్లి జిల్లా ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు. తమ ప్రయాణికులకు కాపాడుకునేందుకు ఏకంగా ఓ బస్సునే బస్టాండ్ మార్చి ప్రజల నుండి మన్ననలు పోందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో జాతీయ రహదారిపై బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా సార్లు అధికారులకు,రాజకీయ నాయకులకు మొర పెట్టుకున్నప్పటికి అక్కడ బస్సు షెల్టర్ ఏర్పాటు కాక వేసవి కాలంలో ప్రజలు నాన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..దీన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల కోసం తాత్కాలికంగా ఆర్టీసీబస్సునే ..బస్సుషెల్టర్ గా ఏర్పాటు చేశారు. చాలా మంది ప్రయానికులు బస్సులో వేచి ఉండి సేదతీరుతూ.. వారికి సంబందించిన బస్సురాగానే వెళ్లి పోతున్నారు. అయితే ఆ గ్రామంలో బస్టాండ్ లేకపోవడంపై తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
Published by:yveerash yveerash
First published: