జగిత్యాల జిల్లా..
న్యూస్ 18 తెగులు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి..
కరోనా వైరస్ ఆత్మీయత , అనుబంధాలకు అడ్డు తెరలు కడుతోంది . చివరి చూపు .. స్పర్శకు నోచుకోకుండా నా.. అన్నవాళ్లను దూరం చేస్తోంది . కుటుంబసభ్యులు , బంధువులు , స్నేహితులు ఎవరూ దరిచేరని దయనీయ స్థితిలో కరోనా మృతుల అంత్యక్రియలను తమ భుజాలపై వేసుకుంటున్నారు, జగిత్యాల జిల్లా, కోరుట్లకు, చెందిన పలువురు యువకులు . భయానక వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంటే ధైర్యం కోల్పోకుండా మానవత్వంతో మృతదే హాలకు కడసారి వీడ్కోలు పలుకుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు .
కొరుట్ల పరిసర ప్రాంతాల్లో ఆదర్శ యువత
ఇలా కోరుట్ల పరిసర ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో 15 మంది కరోనాతో జగిత్యాల , కరీంనగర్ , హైద్రాబాద్ లోని ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలారు . సాధారణంగా కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబసభ్యులు , బంధువులు , స్నేహితులు వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు భయపడి , దగ్గరికి
కూడా రావడం లేదు . కొంతమంది బంధువులు మాత్రం దూరం నుండి ఓదార్పు చెప్పి వెళుతున్నారు. కాని దహన సంస్కారాలు చేసేందుకు సాహసించని పరిస్థితి నెలకొంది .

కోవిడ్ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న యువకులు
యువత బాసట ..
బాధిత కుటుంబాలకు జగిత్యాల జిల్లా, కోరుట్ల యువత తామున్నామని ముందుకు రావడం బాధిత కుటుంబాలకు ఊరటనిస్తోం ది . కోరుట్ల పట్టణంలో ఇప్పటివరకు చనిపోయిన 15 మందికి స్థానిక యువకులు మానవ సందేశ సమితి ఆధ్వర్యంలోని ఇందాదుల్ ముస్లిమీన్ యూత్ సభ్యులు
కలిసి అంత్యక్రియలు నిర్వహించారు . దీంతో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న యువకులను ప్రతి ఒక్క రూ అభినందిస్తున్నారు .

కోవిడ్ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న యువకులు
ఇప్పటి వరకు 45 కరోనా శవాలకు అంత్యక్రియలు
కోరుట్ల యువత కులమతాలకు అతీతంగా కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి మానవత్వంతో కోవిడ్ మృతులకు దహన సంస్కా రాలు చేస్తున్నమని గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు 45 మందికి అంత్యక్రియలు నిర్వహించామని మానవ సందేశ సమితి నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమాన్ని
ఇలాగే కొనసాగిస్తామని యూత్ సభ్యులు చెబుతున్నారు.