HYDERABAD HYDERABAD STUDENT NARKUTI DEEPTHI PLACED IN MICROSOFT HEAD OFFICE WITH RS 2 CRORE PACKAGE SU
Narkuti Deepthi: ట్యాలెంట్‌తో వావ్ అనిపించిన హైదరాబాద్ యువతి.. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం.. వార్షిక వేతనం రూ. 2 కోట్లు
దీప్తి(Image-Facebook)
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థులు తమ ట్యాలెంట్‌తో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అక్కడి టాప్ కంపెనీల్లో భారీ వేతనంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థులు తమ ట్యాలెంట్‌తో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అక్కడి టాప్ కంపెనీల్లో భారీ వేతనంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థిని నర్కుటి దీప్తికి అమెరికాలోని సియాటెల్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన దీప్తికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో దీప్తి.. ఈ నెల 2వ తేదీన ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేశారు. అయితే అంతకు ముందే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాందించారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగిన సమయంలో దీప్తికి మెక్రోసాఫ్ట్, గోల్డ్ మెన్ సాక్స్, అమేజాన్ కంపెనీల్లో.. జాబ్ ఆఫర్స్ వచ్చాయి.
అయితే దీప్తి మాత్రం మెక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వైపు మొగ్గు చూపారు. ఇక, మెక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతినిధులు దీప్తిని.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్(ఎస్‌డీఈ) గ్రేడ్-2 కేటగిరిలో ఎంపిక చేసుకున్నారు. ఈ నెల 17 మెక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో దీప్తి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక, దీప్తి తండ్రి డాక్టర్ వెంకన్న(ఫొరెన్సిన్ నిపుణుడు) హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని క్లూస్ టీమ్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు.
ఇక, దీప్తి విషయానికి వస్తే బీటెక్ పూర్తిచేసిన తర్వాత.. జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంఎస్ చేసేందుకు దీప్తి అమెరికా వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి.. క్యాంపస్ ఇంటర్వ్యూలో భారీ వేతనంతో జాబ్ సంపాందించారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.