మానవ శరీరంలో ఆక్సిజన్ స్థాయిని, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్‌ను SpO2 రూపంలో కొలుస్తారు. మన రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటే, SpO2 స్థాయి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ రేటు 95 నుంచి 99 శాతం వరకు ఉంటుంది. కానీ కరోనా బారిన పడిన చాలామంది రోగుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. ఈ నేపథ్యంలో రక్తంలో ఆక్సిజన్ ఎంత ఉందో తెలుసుకునేందుకు పల్స్ ఆక్సీ మీటర్ల వినియోగం పెరిగింది. అయితే కొన్ని యాప్‌లు కూడా రక్తంలో ఆక్సిజన్ స్థాయి తెలుసుకునే సదుపాయం కల్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో వీటిని డౌన్‌లోడ్ చేసుకొని సులభంగా వినియోగించవచ్చు. అయితే ఈ యాప్‌ల పనితీరును ధ్రువీకరించిన వైద్య పరికరాలతో పోల్చలేం. అందువల్ల కోవిడ్ లక్షణాలు ఉన్నవారు పల్స్ ఆక్సీమీటర్లను మాత్రమే వాడటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిని కొలిచే కొన్ని యాప్స్ ఉన్నాయి.
కేర్‌ప్లెక్స్ వైటల్స్
కేర్‌ప్లెక్స్ వైటల్స్ యాప్.. యాపిల్ యాప్ స్టోర్‌లో iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఏపీకే ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వ్యక్తుల రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని, పల్స్ రేటును గుర్తించడంతో పాటు ఈ వివరాలను నిరంతరం ట్రాక్ చేస్తుంది. దీన్ని వినియోగించడానికి స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా, ఫ్లాష్ లైట్‌పై వేలు పెట్టి, కాసేపు ఉంచాలి. కొన్ని నిమిషాల తర్వాత, యాప్ ఆక్సిజన్ స్థాయి, పల్స్ రేటు, రెస్పిరేటరీ రేటును డిస్‌ప్లే చేస్తుంది. అయితే ఈ యాప్ పనితీరు, కచ్చితత్వం ఎంత వరకు ఉంటుందని చెప్పడం కష్టం.
ఇండియాలో Facebook, Twitter, Instagram బ్లాక్? ఎందుకంటే
PAN Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందా? ఇలా తెలుసుకోండి
పల్స్ మానిటర్ బీట్ ఆక్సిజన్
పల్స్ మానిటర్- బీట్ అండ్ ఆక్సిజన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. ఈ యాప్ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని, పల్స్ రేటును మానిటర్ చేస్తుందని తయారీదారులు తెలిపారు. ఇది శామ్‌సంగ్ డివైజ్‌లలో ఉండే ఇన్ బిల్డ్ సెన్సార్ సాయంతో పనిచేస్తుందని ప్లే స్టోర్ లిస్టింగ్‌లో పేర్కొన్నారు. గెలాక్సీ నోట్ 4, గెలాక్సీ ఎస్ 6 సిరీస్ డివైజ్‌లలో ఇది సమర్థంగా పనిచేస్తుందని వెల్లడించారు. రా-ఐఆర్ (ఇన్‌ఫ్రారెడ్), సెన్సార్ ద్వారా ఆక్సిజన్ స్థాయిని గుర్తించేందుకు యాప్ అడ్వాన్స్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ యాప్‌కు ప్లే స్టోర్‌లో ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది.
బ్లడ్ ఆక్సిజన్ యాప్
బ్లడ్ ఆక్సిజన్ యాప్ ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో లభిస్తుంది. ఇది బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని, హార్ట్ రేటును గుర్తిస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరాపై వేలు పెడితే చాలు, యాప్ బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని ఆటోమెటిగ్గా కొలుస్తుంది. కానీ ఈ యాప్ పనితీరును కూడా ధ్రువీకరించిన వైద్య పరికరాలతో పోల్చలేం.
Jio Plans: జియో ఫోన్ వాడుతున్నారా? రూ.39 నుంచి లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
Mi 10i 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,500 డిస్కౌంట్
పల్స్ ఆక్సిమీటర్ ట్రాకర్
పల్స్ ఆక్సిమీటర్ ట్రాకర్ యాప్ ద్వారా బ్లడ్ ఆక్సిజన్ లెవల్‌ను క్రమం తప్పకుండా ట్రాక్ చేయవచ్చు. ఇప్పటికే ఆక్సిమీటర్‌ను ఉపయోగిస్తున్నవారు, డివైజ్ చూపించే కొలతలను రికార్డ్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా వినియోగదారులు పల్స్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని క్రమం తప్పకుండా ట్రాక్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ ద్వారా ఆక్సిజన్ స్థాయిని కొలవడం కుదరదు. కేవలం SpO2 స్థాయిని ట్రాక్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
ఎవిటాల్జ్ SpO2
ఎవిటాల్జ్ SpO2 యాప్ కూడా, శరీరంలో బ్లడ్ ఆక్సిజన్ లెవల్‌ను పర్యవేక్షించడానికి, హార్ట్ రేటును ఎప్పుడైనా, ఎక్కడైనా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. FORA పల్స్ ఆక్సిమీటర్, ఎవిటాల్జ్ SpO2 యాప్ సహాయంతో వినియోగదారులు బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని, హార్ట్ రేటును తనిఖీ చేయవచ్చు. FORA T’NG బ్లూటూత్ పల్స్ ఆక్సిమీటర్‌తో ఈ యాప్‌ను అనుసంధానం చేసుకొని, యూజర్ల హెల్త్ డేటా, పాత కొలతలు, ట్రెండ్‌ను పోల్చుకోవచ్చు. కానీ ఈ యాప్ ఇతర ఆక్సిమీటర్‌లతో పనిచేయదు.