• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ONEPLUS TV 40Y1 SMART TV LAUNCHED IN INDIA PRICED AT RS 21999 SS GH

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ... ధర రూ.21,999 మాత్రమే

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ... ధర రూ.21,999 మాత్రమే

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ... ధర రూ.21,999 మాత్రమే (image: Oneplus)

Oneplus TV 40Y1 | వన్‌‌ప్లస్ ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీ లాంఛ్ చేసింది. వన్‌ప్లస్ లేటెస్ట్‌గా తీసుకొచ్చిన 40 అంగుళాల టీవీ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇండియా తన వై సిరీస్​ టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఇప్పటివరకు 32 అంగుళాలు, 43 అంగుళాల టీవీలు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు, 40 అంగుళాల టీవీని విడుదల చేసింది. మే 26 నుంచి ఫ్లిప్​కార్ట్​ ద్వారా ఈ కొత్త మోడల్ అమ్మకాలు జరగనున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే వన్‌ప్లస్ ఆన్​లైన్​ స్టోర్​లో కూడా లభించనుంది. ఈ స్మార్ట్​టీవీ రూ.21,999 ధర వద్ద అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఫ్లిప్​కార్ట్​లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసేవారికి 10 శాతం అదనపు డిస్కౌంట్​ లభిస్తుంది. ఇదివరకే విడుదలైన వన్​ప్లస్​ 32 వై 1 టీవీ రూ.15,999 వద్ద లభిస్తుండగా, వన్‌ప్లస్ టీవీ 43 వై 1 రూ .26,999 వద్ద అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 మోడల్​లో ఆండ్రాయిడ్ సపోర్ట్ చేర్చింది. అంటే యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లోని అనేక యాప్స్​ను ఈ స్మార్ట్​టీవీలో యాక్సెస్​ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్​టీవీ బుల్ట్​ ఇన్​ క్రోమ్​కాస్ట్​తో పనిచేస్తుంది. మీ స్మార్ట్​​ఫోన్​ను టీవీకి కనెక్ట్​ చేసి కంటెంట్​ను ప్లే చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఇండియాలో Facebook, Twitter, Instagram బ్లాక్? ఎందుకంటే

PAN Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందా? ఇలా తెలుసుకోండి

ఈ కొత్త వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఫ్లాగ్‌షిప్ మోడల్​లో టైప్ సింక్, స్మార్ట్ వాల్యూమ్ కంట్రోల్, క్విక్ యాప్ స్విచ్, మల్టీ-డివైస్ కంట్రోల్, యూజర్ మెట్రిక్స్ వంటి ఫీచర్లను చేర్చింది. దీనిలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్‌స్టార్, సోనీ లివ్, హంగామా, ఈరోస్ నౌ, అమెజాన్​ ప్రైమ్ స్ట్రీమింగ్​ వీడియోలకు యాక్సెస్​ను అందిస్తుంది. వీటితో పాటు వన్‌ప్లస్ కనెక్ట్ యాప్​ యాక్సెస్​ను కూడా అందించింది. దీని ద్వారా వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వన్‌ప్లస్ టీవీకి కనెక్ట్ చేసుకొని సులభంగా వీడియో స్ట్రీమింగ్​ చేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రెండింగ్ వీడియోలను సెర్చ్​​ చేయడానికి, మెరుగైన ట్రాక్‌ప్యాడ్‌తో ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించడానికి, తరుచుగా ఉపయోగించే యాప్స్​ మధ్య త్వరగా మారడానికి, పిక్చర్​ స్క్రీన్ షాట్​ చేయడానికి ఈ స్మార్ట్​టీవీ అనుమతిస్తుంది.

Jio Plans: జియో ఫోన్ వాడుతున్నారా? రూ.39 నుంచి లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Mi 10i 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,500 డిస్కౌంట్

ఇక వన్‌ప్లస్ టీవీ 40 వై 1 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలో డాల్బీ ఆడియో సపోర్ట్, 20W సౌండ్ అవుట్‌పుట్‌ని అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా చూస్తే దీనిలో వై-ఫై 2.4GHz, బ్లూటూత్ 5.0, ఈథర్నెట్ పోర్ట్, RF కనెక్షన్ ఇన్​పుట్, HDMI ఇన్​పుట్, AV ఇన్​పుట్, డిజిటల్ ఆడియో అవుట్​పుట్, 2 USB పోర్ట్​ వంటి అద్భుతమైన ఫీచర్లను జోడించింది. సరసమైన ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంతో వన్​ప్లస్ బ్రాండ్ క్రేజ్​ పెరిగింది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు