NOISE AIR BUDS MINI LAUNCHED WITH 15 HOURS BATTERY LIFE PRICE STARTS AT RS 1299 MK GH
Noise Air Buds: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లున్న నాయిస్ వైర్ లెస్ ఎయిర్ బడ్స్ లాంచ్
ప్రతీకాత్మకచిత్రం
ఇటీవల కాలంలో నాయిస్ ఇయిర్ బడ్స్ ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. భారత్ లో బడ్జెట్ ధరలో అత్యుత్తమ వైర్లెస్ బడ్స్ ఉత్పత్తి చేస్తున్న బ్రాండ్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఈ నెలలోనే నాయిస్ సంస్థ నుంచి ఫ్లెయిర్ అనే నెక్ బ్యాండ్ తో పాటు ఓ స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యాయి.
ఇటీవల కాలంలో నాయిస్ ఇయిర్ బడ్స్ ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. భారత్ లో బడ్జెట్ ధరలో అత్యుత్తమ వైర్లెస్ బడ్స్ ఉత్పత్తి చేస్తున్న బ్రాండ్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఈ నెలలోనే నాయిస్ సంస్థ నుంచి ఫ్లెయిర్ అనే నెక్ బ్యాండ్ తో పాటు ఓ స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యాయి. తాజాగా భారత మార్కెట్లో సరికొత్త వైర్లెస్ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. నాయిస్ ఎయిర్ బడ్స్ మినీని అధికారికంగా విపణిలోకి తీసుకొచ్చింది. ఇవి ఎయిర్ పాడ్స్ ను పోలి ఉన్నాయి. కాంపాక్ట్ ఫామ్ ప్యాక్టర్ లో అందుబాటులోకి వచ్చాయి.
ధర..
ఈ సరికొత్త నాయిస్ ఎయిర్ బడ్స్ మినీ ఆకర్షణీయమైన ధరకే మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర వచ్చేసి రూ.1299లుగా నిర్దేశించింది కంపెనీ. ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లేదా నాయిస్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ఈ ఇయర్ బడ్స్ రెండు కలర్స్ లో లభ్యమవుతున్నాయి. పెరల్ వైట్, జెట్ బ్లాక్ రంగుల్లో సొంతం చేసుకోవచ్చు.
నాయిస్ ఎయిర్ బడ్స్ స్పెసిఫికేషన్లు..
ఈ సరికొత్త వైర్లెస్ ఇయర్ బడ్స్ 14.2 ఎంఎం ఆడియో డ్రైవర్లను కలిగి ఉండి లౌడ్ గా, స్పష్టమై సౌండ్ క్వాలిటీతో పనిచేస్తున్నాయి. వీటిలో ట్రూబాస్ టెక్నాలజీని వినియోగించారు. కాల్ క్వాలిటీ కోసం ప్రత్యేకంగా మైక్స్ ను పొందుపరిచారు. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 15 గంటల పాటు నిరంతారయంగా ఉపయోగించుకోవచ్చని నాయిస్ సంస్థ స్పష్టం చేసింది. టైప్-సీ పోర్ట్ తో అందుబాటులోకి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ ను 2 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఇండికేటర్ల ద్వారా
ఎంతమేరకు ఛార్జ్ ఉందో మీరు తెలుసుకోవచ్చు.
హైపర్ సింక్ టెక్నాలజీ, 5.0 బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల స్మూత్ గా, సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లతో పాటు బ్లూటూత్ ఆప్షన్ ఉన్న ల్యాప్ పాట్ కంప్యూటర్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఈ ఎయిర్ బడ్స్ మినీలో ఉన్నాయి. అథ్లెటిక్స్ పాల్గొనే వారికి చెమట నుంచి రక్షణ పొందేందుకు గాను ఈ ఇయర్ బడ్స్ లో ఐపీఎక్స్4 స్వెట్ రెసిస్టెన్స్ కూడా ఇందులో ఉందని కంపెనీ పేర్కొంది.
"రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫీచర్లతో పాటు టెక్నాలజీ ప్యాక్ చేసిన డివైజ్ ల కోసం నాయిస్ మేకర్స్ అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్న కాంపాక్ట్ సైజ్ ఇయర్ బడ్స్ అయిన నాయిస్ ఎయిర్ బడ్స్ అత్యుత్తమమైన ఎంపిక. మా వినియోగదారుల కోసం అత్యుత్తమ ఫీచర్లను అందించే ఉత్పత్తులను, వారి డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్నాం." అని నాయిస్ సహా వ్యవస్థాపకులు అమిత్ ఖాత్రి స్పష్టం చేశారు.