• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MOTOROLA EDGE S PIONEER EDITION LAUNCHED KNOW PRICE AND SPECIFICATIONS SS GH

Motorola Smartphone: మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Motorola Smartphone: మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Motorola Smartphone: మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (ప్రతీకాత్మక చిత్రం)

Motorola Smartphone | మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
మార్కెట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటికీ మోటోరోలా ఫోన్లకు ఓ ప్రత్యేక స్థానముంది. తాజాగా ఈ అమెరికన్ దిగ్గజ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్. వెనిల్లా కలర్ వేరియంట్లో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ ను సంస్థ ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ మిడ్-రేంజ్ మోటోరోలా ఫోన్ ను ఆ దేశంలో సింగిల్ కాన్ఫిగరేషన్ తోనే వచ్చింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ భారత్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే అంశంపై స్పష్టత లేదు. ధర కూడా ఇతర కలర్ వేరియంట్ల కంటే తక్కువగా ఉండటం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలోనే మోటోరోలా ఎడ్జ్ ఎస్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీంట్లో స్నాప్ డ్రాగన్ 870 SoC ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ స్టోరేజి వంటి ఫీచర్లు ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్ ధర


ఈ సరికొత్త ఫోన్ ధర 1999 యువాన్లు(దాదాపు రూ.22,600)గా ఉంది. ఇది 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇతర కలర్స్ వేరియంట్లయిన ఎమరాల్డ్ లైట్, మిస్ట్ ధర కూడా 1999 యువాన్లే. అయితే ఈ ఫోన్లు 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కంపెనీ అధికారిక వెబ్ సైట్, JD.com పోర్టల్స్ ద్వారా ఈ వేరియంట్‌ను కొలుగోలు చేయవచ్చని సంస్థ పేర్కొంది. ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయాలనుకుంటే చైనాలోని లెనోవో స్టోర్లలో తీసుకోవచ్చు.

ఇండియాలో Facebook, Twitter, Instagram బ్లాక్? ఎందుకంటే

PAN Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందా? ఇలా తెలుసుకోండి

స్పెసిఫికేషన్లు


మోటోరోలా ఎడ్జ్ ఎస్ వేరియంట్లలో ఉండే ఫీచర్లన్నీ ఈ సరికొత్త పయోనీర్ ఎడిషన్ లోనూ పొందుపరిచారు. ఈ ఫోన్ ఆండ్రాయిండ్ 11 MyUIతో పనిచేస్తుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్ HD(1080X2520 పిక్సెల్స్) డిస్ ప్లేతో పాటు 21:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. అంతేకాకుండా 90HZ రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 870 SoC, 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. 64-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ప్రైమరీ సెన్సార్ తో పాటు f/1.7 లెన్స్ ను కలిగి ఉంది. 16-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలు దీని సొంతం.

Jio Plans: జియో ఫోన్ వాడుతున్నారా? రూ.39 నుంచి లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Mi 10i 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,500 డిస్కౌంట్

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డ్యూయల్ ఫ్రంట్ కెమెరా.. ఇందులో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉన్నాయి. ఇందులో 8-మెగాపిక్లెస్ సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరో ఆకర్షణ. కనెక్టివిటీ ఆప్షన్ల దగ్గరకొస్తే 5జీ, 4జీ LTE, వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్/A-GPS, NFC యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లాంటి ప్రత్యకేతలు ఇందులో ఉన్నాయి. 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ, 20 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ IP52 స్ప్లాష్ రెసిస్టెంట్ బిల్డ్ సదుపాయముంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ కూడా ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు