• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RCB VS KKR LIVE CRICKET SCORE IPL 2021 RUSSELL SWITCHES GEARS BUT KKR LOST MATCH SA

RCB vs KKR: ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ... ఆండ్రీ రస్సెల్ శ్రమ వృథా!

RCB vs KKR: ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ... ఆండ్రీ రస్సెల్ శ్రమ వృథా!

RCB

చెపాక్‌ వేదికగా కేకేఆర్‌,ఆర్సీబి మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కొల్‌కతా జట్టు 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 205 పరుగుల భారీ టార్గెట్ ఛేదించలేక చతికలపడింది.

  • Share this:
    చెపాక్‌ వేదికగా కేకేఆర్‌,ఆర్సీబి మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కొల్‌కతా జట్టు 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 205 పరుగుల భారీ టార్గెట్ ఛేదించలేక చతికలపడింది. టార్గెట్ ఛేదనకు బ్యాటింగ్ దిగిన కేకేఆర్‌కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జేమీసన్‌ వేసిన రెండో ఓవర్లో శుభమన్‌ గిల్‌(21) ఔటయ్యాడు. ఆ ఓవర్లో మొదటి బంతిని ఫోర్‌, మూడు, నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన శుభమన్‌ గిల్‌ ఐదో బంతికి క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఆరో ఓవర్లో చివరి బంతికి రాహుల్‌ త్రిపాఠి(25) భారీ షాట్ ఆడబోయి సిరాజ్‌కు చిక్కాడు. దీంతో పవర్ ఫ్లే ముగిసే సమయానికి కోల్‌కతా 57/2 పరుగులు చేసింది.

    7 ఓవర్లో కోల్‌కతా మరో వికెట్ నష్టపోయింది. చాహల్‌ వేసిన ఈ ఓవర్లో రెండో,నాలుగో బంతిని ఫోర్‌ బాదిన నితీశ్ రాణా(18) ఐదో బంతికి దేవదత్‌ పడిక్కల్‌కు చిక్కాడు. 9 ఓవర్లో కోల్‌కత్తాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చాహల్‌ వేసిన ఈ ఓవర్‌లో మూడో బంతికి దినేశ్ కార్తీక్‌(2) ఔటయ్యాడు. అతడు ఎల్బీగా వెనుదిరగడంతో కోల్‌కతా నాలుగో వికెట్‌ నష్టపోయింది. ఆ తర్వాత వరుసగా కేకేఆర్ వికెట్లు కోల్పోవడం.. రసుల్ బ్యాట్ ఝళీపించిన లాభం లేకపోయింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు