• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RCB VS KKR IPL 2021 AB DE VILLIERS BLISTERING FIFTY PUSHES BANGALORE BIG TOTAL SA

RCB vs KKR: డివిలియర్స్ హాట్ హిట్టింగ్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే!

RCB vs KKR:  డివిలియర్స్ హాట్ హిట్టింగ్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే!

AB De Villiers

చెపాక్‌ వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెుదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు అదిలోనే షాక్ తగిలింది.

  • Share this:
    చెపాక్‌ వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెుదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 204 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు అదిలోనే షాక్ తగిలింది. వరుణ్‌ చక్రవర్తి వేసిన 2వ ఓవర్‌లో రెండో బంతికి విరాట్ కోహ్లి(5) రాహుల్‌ త్రిపాఠికి చిక్కాడు. అదే ఓవర్లో చివరి బంతికి రజత్‌ పాటిదార్‌(1) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మాక్స్‌వెల్.. పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్ళాడు. పవర్‌ఫ్లే ముగిసేసమయానికి బెంగళూరు 45/2 పరుగులు చేసింది. ఆరో ఓవర్‌ తర్వాత ఇద్దరూ స్కోర్ వేగాన్ని పెంచుతూ పోయారు. కమిన్స్‌ ఓవర్లో నాలుగో బంతిని మాక్స్‌వెల్‌(50) బౌండరీకి తరలించి 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

    ఇక 10 ఓవర్లు దాటే సరికి బెంగళూరు 84/2 పరుగులు చేసింది. తర్వాత ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 12వ ఓవర్‌లో తొలి బంతికి పడిక్కల్‌(25) రాహుల్‌ త్రిపాఠికి చిక్కి పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో వచ్చిన డివిలియర్స్‌తో కలిసి మాక్స్‌వెల్ మరింతగా రెచ్చిపోయాడు. చివరకుమ్యాక్స్‌వెల్‌( 78, 49 బంతులు; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి హర్భజన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత డివిలియర్స్ కేకేఆర్ బౌలర్లను ఆడుకున్నాడు,  సిక్సర్లతో‌ విధ్వంసం సృష్టించాడు. ఇకఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు