• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • PUNJAB KINGS WON THE TOSS AND ELECTED TO BAT KEDAR JADAV DEBUT FOR SRH IN IPL JNK

SRH vs PBKS : టాస్ గెల్చిన పంజాబ్ .. ఇరు జట్లలోకి అరంగేట్రం చేసిన ఆటగాళ్లు వీళ్లే..

SRH vs PBKS : టాస్ గెల్చిన పంజాబ్ .. ఇరు జట్లలోకి అరంగేట్రం చేసిన ఆటగాళ్లు వీళ్లే..

పంజాబ్, హైదరాబాద్ మధ్య కీలక మ్యాచ్ చెన్నైలో జరుగుతున్నది.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగనున్నది. టాస్ గెల్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. చెన్నై పిచ్‌లో ఛేజింగ్ కష్టం అవుతుందని భావించి తాను బ్యాటింగ్ ఎంచుకున్నట్లు కేఎల్ రాహుల్ చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్లు కేఎల్ రాహుల్ చెప్పాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మూడు సార్లు ఛేజింగ్ చేసి ఓడిపోయింది. ఈ కారణంగానే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. ఫ్రాంచైజీలో ఉన్న ప్రతీ ఒక్కరం పాజిటివ్ మైండ్‌తో ఉన్నాము. లక్ష్యాన్ని నిర్దేశించడంలో కానీ.. లక్ష్యాన్ని ఛేదించడంలో గాని ఎలాంటి అపనమ్మకాలు లేవు. సమద్‌కు గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కలేదు. ముజీబుర్ బదులు కేన్ విలియమ్‌సన్‌ను తీసుకున్నామని డేవిడ్ వార్నర్ అన్నారు.

    సన్‌రైజర్స్ జట్టులోకి కేదార్ జాదవ్ అరంగేట్రం చేశాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన కేదార్.. ఈ సీజన్ నుంచే హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక తుది జట్టులోకి జాదవ్‌తో పాటు కేన్ విలియమ్‌సన్, సిద్దార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. మనీష్ పాండే గాయం కారణంగా ఆడటం లేదు. ముజీబుర్ రెహ్మాన్, అబ్దుల్ సమద్‌ను పక్కన పెట్టారు.

    పంజాబ్ కింగ్స్ తరపున ఫాబియన్ అలెన్ అరంగేట్రం చేశాడు. తుదిజట్టులో అతడితో పాటు మురుగన్ అశ్విన్, మోసెస్ హెన్రిక్స్‌కు స్థానం లబించింది. జలజ్ సక్సేనా, జే రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్‌లకు విశ్రాంతినిచ్చారు.





    సన్‌రైజర్స్ హైదరాబాద్ :

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్‌సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

    పంజాబ్ కింగ్స్ :

    కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మోసెస్ హెన్రిక్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు