NATIONAL LEVEL BOXING CHAMPION ABID KHAN TURNS AUTO DRIVER HEARTBREAKING VIDEO GOES VIRAL GH SRD
Viral Video : ఒకప్పుడు బాక్సింగ్ ఛాంపియన్..ఇప్పుడు ఆటో డ్రైవర్..సాయం చేయడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో..
Photo Credit : You Tube
Viral Video : ఈ హృదయవిదారక వీడియో ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది. 17 నిమిషాల నిడివి గల ఈ క్లిప్‌లో ఈ మాజీ నార్త్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ అబిద్ ఖాన్ తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు.
ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతల కారణంగా చాలా మంది క్రీడాకారులు ఏదో ఒక పనిచేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. వారిని ఆదుకొని అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడంతో పొట్ట కూటి కోసం రోజూ వారి కూలీలుగా మారుతున్నారు. తాజాగా, ఇటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. మాజీ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ ఆబిద్ ఖాన్ దుస్థితి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. ఎన్ఐఎస్ పాటియాలాలో శిక్షణ పొందిన ఆయన మంచి కోచ్‌గా ఎందరో యువ బాక్సర్లను తీర్చిదిద్దాల్సిన సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఆటోవాలాగా మారాడు. భారతదేశంలోని చాలా మంది క్రీడాకారుల దుస్థితికి ఇది నిలువుటద్దంగా నిలుస్తోంది. ఒకప్పటి బాక్సింగ్ ఛాంపియన్ ఇప్పుడు ఆటో నడుపుతున్న వీడియోను ‘స్పోర్ట్స్ గావ్’ అనే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది. ఈ హృదయవిదారక వీడియో ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది. 17 నిమిషాల నిడివి గల ఈ క్లిప్‌లో ఈ మాజీ నార్త్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ అబిద్ ఖాన్ తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘‘1988–89 మధ్య కాలంలో నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందాను. అనంతరం ప్రొఫెషనల్‌గా ఐదేళ్ల పాటు ఆర్మీ బాక్సింగ్ జట్లకు శిక్షణ కూడా ఇచ్చాను. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పంజాబ్ విశ్వవిద్యాలయంలో కోచ్‌గా కూడా వ్యవహరించాను. ఎంతో మంది యువకులకు శిక్షణనిచ్చి బాక్సర్లుగా తీర్చిదిద్దాను. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించపోవడంతో ఇప్పుడు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాను”అని అన్నాడు.
భారత క్రీడాకారుల దుస్థితికి నిదర్శనం..
కాగా. బాక్సింగ్‌లో ఎన్నో మెళకువలు తెలిసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సమయంలో కుటుంబ పరిస్థితులు అతడ్ని ఆటో డ్రైవర్‌గా మార్చేశాయి. ఆర్థిక సమస్యల కారణంగా బాక్సింగ్ శిక్షణను కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం బతుకుదెరువు కోసం ఆటో నడపడం, ధాన్యం బస్తాలను మార్కెట్‌కు తీసుకురావడం వంటి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు.
తాను జాతీయ బాక్సర్ అయినప్పటికీ.. తాను పడుతున్న ఇబ్బందులు తన ఇద్దరు కుమారులు పడకూడదని భావించి వారిని బాక్సింగ్ వైపు ప్రోత్సహించలేదు. అయితే, తాను తిరిగి బాక్సింగ్ కోచ్‌గా మారాలని ఆశిస్తున్నాడు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా అలా చేయలేకపెతున్నట్లు వాపోయాడు. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Story of national boxer Abid Khan: From NIS qualified coach to driving auto...
Watch full video at YouTube channel 'Sports Gaon'
And do watch it, we need to strengthen YouTube channel Sports Gaon to bring more such stories.. Thanks pic.twitter.com/hHjhTtW5W9
Very sad indeed..@KirenRijiju should rehablitate such talented people to help youth and our Nation to achieve newer landmarks in the field of sports. https://t.co/2LikvovS3B
This is heartbreaking yet so inspiring to see how humbly this sportsperson has coped with unfulfilled ambition. Can you please share his contact details? @duggal_saurabhhttps://t.co/QNC0RvlQ7q
ఎంతో ప్రతిభ ఉన్న ఈ జాతీయ బాక్సర్ దుస్థితిని చూసి చలించిపోయి కొంత మంది తమకు తోచిన సాయం చేసేందుకు ముందుకొస్తుండగా.. మరికొందరు మాత్రం ఇటువంటి వారిని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా అబిద్ ఖాన్ దుస్థితిపై స్పందిస్తూ “జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ అబిద్ ఖాన్ దుస్థితి నన్ను ఎంతగానో కలిగిచివేసింది. ఆయన కల నెరవేర్చుకోవడంలో ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారడం అత్యంత బాధాకరం. దయచేసి ఆయన వివరాలను పంపించగలరు.” అని ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ సౌరభ్ దుగ్గావ్ను కోరారు. అయితే, ఖాన్ ఆర్థిక సహాయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడని, అతను తిరిగి బాక్సింగ్ కోచ్‌గా రావాలని కోరుకుంటున్నాడని పేర్కొన్నాడు.