• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MUMBAI INDIANS YOUNG SPINNER RAHUL CHAHAR REVEALS SECRET BEHIND HIS HAIR STYLE SRD

Rahul Chahar : రాహుల్ చాహర్ పిలక గుట్టు రట్టు..ఈ స్టైల్‌కు కారణం గర్ల్ ఫ్రెండ్ అట..ఆమె ఎవరో తెలుసా..?

Rahul Chahar : రాహుల్ చాహర్ పిలక గుట్టు రట్టు..ఈ స్టైల్‌కు కారణం గర్ల్ ఫ్రెండ్ అట..ఆమె ఎవరో తెలుసా..?

రాహుల్ చాహర్ పిలక గుట్టు రట్టు..ఈ స్టైల్‌కు కారణం గర్ల్ ఫ్రెండ్ అట..ఆమె ఎవరో తెలుసా..?

Rahul Chahar : ముంబై ఇండియన్స్ విజయాల్లో యంగ్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తన స్పిన్ మాయాజాలంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఇది వరకటి సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సారి ప్రారంభం నుంచే చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకదాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడతను.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతూ.. ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. విజయం కోసం ప్రతి జట్టు ఆఖరి వరకూ నువ్వా- నేనా అన్న రితీలో పోరాడుతున్నాయ్. ఇక, డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ లో ఓడినప్పటికీ..తర్వాత రెండు మ్యాచ్ ల్లో విక్టరీ కొట్టింది. ముంబై ఇండియన్స్ విజయాల్లో యంగ్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తన స్పిన్ మాయాజాలంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఇది వరకటి సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సారి ప్రారంభం నుంచే చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకదాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడతను. ఈ మూడు మ్యాచ్‌లల్లో ఏడు వికెట్లను పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. రాహుల్ చాహర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 4/27. సీజన్ సీజన్‌కు రాటుదేలుతున్నాడు. అయితే, అతని ప్రదర్శన కన్నా మనోడి హెయిర్ స్టైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వెస్టిండియన్లను తలపించే హెయిర్ కట్ అతనిది. అతనిది కర్లింగ్ హెయిర్ స్టైల్‌. రింగుల జుట్టును బలంగా వెనక్కి దువ్వినట్టు ఉంటుంది. చివర్లో చిన్నపిలకను ముడేసి ఉంటాడు. మిగిలిన ఇండియన్ క్రికెటర్లతో పోల్చుకుంటే.. రాహుల్ చాహర్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంటుంది. దానికి కారణం ఏమిటనేది ఇప్పటిదాకా పెద్దగా బయటికి రాలేదు. అతని జుట్టు గుట్టు తాజాగా వెలుగు చూసింది. అతని డిఫరెంట్ హెయిర్ స్టైల్‌కు కారణం.. అతని గర్ల్‌ఫ్రెండే. రాహుల్ చాహర్‌కు 2019లో నిశ్చితార్థమైంది. టాప్ హెయిర్ స్టైలిస్ట్ ఇషానీని అతను పెళ్లి చేసుకోబోతున్నాడు.

    వారిద్దరిదీ పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. చాలాకాలం పాటు రాహుల్ చాహర్-ఇషానీ ప్రేమపక్షుల్లా తిరిగారు. ప్రేమలోకంలో విహరించారు. 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం మాత్రం ఇంకా రాలేదు. పెళ్లి పీటలు ఎక్కడానికి ఇంకా సమయం ఉందనేది రాహుల్ చాహర్ కుటుంబీకుల మాట. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత వారిద్దరూ ఒక్కటి కావచ్చని అంటున్నారు. తాజాగా తన ఇషానీతో కలిసి దిగిన ఓ ఫొటోను రాహుల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.








    View this post on Instagram






    A post shared by Rahul Chahar (@rdchahar1)





    మరోవైపు, కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ముంబై ఇండియన్స్. గతేడాది ఫైనలిస్ట్ లు అయిన ఈ రెండు జట్ల మధ్య సమరం..ఫ్యాన్స్ ను కచ్చితంగా అలరిస్తోంది. ఈ మ్యాచ్ లో కూడా రాహుల్ చాహర్ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తే.. ముంబై ఇండియన్స్ కి తిప్పలు తప్పవు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు