IPL 2021 PBKS VS CSK LIVE UPDATES CHENNAI SUPER KINGS WON BY 6 WICKETS SRD
PBKS vs CSK : గర్జించిన ధోనీసేన.. పంజాబ్ చిత్తు..ఈ సీజన్ లో బోణి కొట్టిన CSK..
PBKS vs CSK : గర్జించిన ధోనీసేన.. పంజాబ్ చిత్తు..ఈ సీజన్ లో బోణి కొట్టిన CSK..
PBKS vs CSK : ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్ లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ లో ఫాంలోకి వచ్చినట్టు కన్పించింది ధోనీసేన. మరోవైపు.. పంజాబ్ బ్యాట్స్ మన్ నిర్లక్ష్యపు బ్యాటింగ్ తో మూల్యం చెల్లించుకున్నారు.
ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చిత్తు అయింది. 107 పరుగుల స్వల్వ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై మరో 26 బంతులు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది. డుప్లెసిస్ 33 బంతుల్లో 36 పరుగులు, మొయిన్ అలీ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. స్వల్వ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. యంగ్ బ్యాట్స్ మన్ రుతు రాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 5 పరుగులు చేసి.. అర్షదీప్ బౌలింగ్ లో ఔటై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన మొయిన్ అలీ వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదేడంతో పంజాబ్ బౌలర్ల మీద ఒత్తిడి పెరిగింది. మరోవైపు డుప్లెసిస్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. అజేయంగా నిలిచి చెన్నై సూపర్ కింగ్స్ కు విక్టరీ అందించాడు. అయితే వరుస విరామాల్లో అలీ, రైనా, రాయుడు అవుటయ్యారు. అయితే, అప్పటికే చెన్నై విక్టరీ ఖరారైంది. ఆఖర్లో సామ్ కర్రన్ బౌండరీతో సీఎస్కేకు విక్టరీ అందించాడు. షమీ రెండు వికెట్ల తో సత్తా చాటాడు. మరోవైపు అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్ చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. చహర్ ఐపీఎల్ టోర్నీలో కెరీర్ బెస్ట్ గణాంకాలు (4/13) నమోదు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 రన్స్ చేసి.. చెన్నైకి 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ మాత్రం బ్యాట్ జులిపించాడు. 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. షారుఖ్ కూడా ఆడకుంటే పంజాబ్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదే. చెన్నై బౌలర్లలో చహర్ 4 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవో తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు చెన్నై పేసర్ దీపక్ చహర్ చుక్కలు చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో పంజాబ్ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (5), మయాంక్ అగర్వాల్ (0)తో పాటు క్రిస్ గేల్(10), దీపక్ హుడా (10), నికోలస్ పూరన్ (0) టాప్ ఆర్డర్ మొత్తం పూర్తిగా విఫలమైంది. రాహుల్ రనౌట్ కాగా.. మిగతా అందర్నీ చహర్ పెవిలియన్ పంపాడు.
ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్ లో బోణీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ లో ఫాంలోకి వచ్చినట్టు కన్పించింది ధోనీసేన. మరోవైపు.. పంజాబ్ బ్యాట్స్ మన్ నిర్లక్ష్యపు బ్యాటింగ్ తో మూల్యం చెల్లించుకున్నారు. ఇక రేపటి మ్యాచ్ లో సన్ రైజర్స్ తో తలపడనుంది ముంబై ఇండియన్స్. చెన్నై వేదికగా ఈ ఫైట్ జరగనుంది.