క్రీడా రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈవెంట్స్ సజువుగా సాగలానే ఉద్దేశంతో ఆటగాళ్ళపై కఠిక ఆంక్షలను అమలు చేస్తున్నాయి క్రీడా సంఘాలు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021లో
కూడా ఈ కఠిన నిబంధనలు అమలు అవుతున్నాయి. బయోబబుల్‌లో లాంటి అత్యంత కఠిన పరిస్థితుల్లో ఆటగాళ్ళు ఉండలేకపోతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ బయో బబుల్ జోన్‌లో ఉండలేక స్వదేశానికి పయనమయ్యాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కి చోటు దక్కకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు.
బయో బబుల్‌ను తట్టుకుని టోర్నీలో ఉంటే నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం చేశారనే అవేదనతో లివింగ్‌స్టోన్ గత రాత్రి స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. ఇదే బూచి చూపించి సన్‌రైజర్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా టోర్నీకి దూరంగా ఉన్నాడు. రాజస్థాన్ ఇప్పటికే బెన్‌స్టోక్స్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగల తాజాగా లివింగ్‌స్టోన్ కూడా దూరం కావడం పెద్ద దెబ్బే.