TRS MAJORITY IN NAGARJUNA SAGAR BY ELECTION STOOD AT 6592 AFTER 7 ROUNDS OF COUNTING AK
Nagarjuna Sagar By Election Result: సాగర్‌లో పెరుగుతున్న టీఆర్ఎస్ ఆధిక్యం.. ఎంతంటే..
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Nagarjuna Sagar By Election Result: తొలి రౌండ్ నుంచే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌పై ఆధిక్యత కనబరుస్తూ వస్తున్న టీఆర్ఎస్.. రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యతను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.
తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. తొలి రౌండ్ నుంచే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌పై ఆధిక్యత కనబరుస్తూ వస్తున్న టీఆర్ఎస్.. రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యతను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఏడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 6592 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఏడో రౌండ్‌లో 1415 ఓట్ల ఆధిక్యత సాధించిన టీఆర్ఎస్, 6వ రౌండ్‌లో 940, 5వ రౌండ్‌లో 766, 4వ రౌండ్‌లో 984, 3వ రౌండ్‌లో 539, 2వ రౌండ్‌లో 741, 1వ రౌండ్‌లో 1475 ఆధిక్యత కనబర్చింది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవంతో సాగర్‌లో కచ్చితంగా విజయం సాధించాలని భావించిన టీఆర్ఎస్.. అందుకు తగ్గట్టుగా పావులు కదిపింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ఉప ఎన్నికల అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేు, ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో దిగి పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఇక ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. సాగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గం కావడం.. ఆయనే బరిలో ఉండటంతో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సాగింది. దుబ్బాకలో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన బీజేపీ.. నాగార్జునసాగర్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది.