• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • EARLY ELECTION COUNTING TREND PREDICTS MAMATA BANERJEE TRINAMOOL CONGRESS MAY ONCE AGAIN GRAB WEST BENGAL MAY DEFEAT BJP AK

West Bengal Election Result: బెంగాల్‌లో తృణమూల్ ఆధిక్యం.. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా.. అధికారం మళ్లీ మమతదేనా ?

West Bengal Election Result: బెంగాల్‌లో తృణమూల్ ఆధిక్యం.. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా.. అధికారం మళ్లీ మమతదేనా ?

మమతా బెనర్జీ (File)

West Bengal Election Result: ఫలితాల్లో అనూహ్య మార్పులు వస్తే తప్ప.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బెంగాల్‌లో అధికారంలో మళ్లీ మమతకే దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Share this:
    దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో.. ఎక్కువమంది దృష్టి పశ్చిమ బెంగాల్ మీదే ఉంది. ఇక్కడ అధికారం నిలబెట్టుకోవాలని మమత బెనర్జీ.. అధికారంలో తమ సొంతం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం రెండు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేశాయి. అయితే ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే మాత్రం పశ్చిమ బెంగాల్ పీఠం మళ్లీ మమతా బెనర్జీకే దక్కే అవకాశం ఉందని కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అధికారం దక్కాలంటే రావాల్సిన మొత్తం 292 స్థానాల్లో 147 సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది.

    ఈ సంఖ్యకు ప్రస్తుతం మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ దగ్గరగా వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రచారం తృణమూల్ కాంగ్రెస్ 228 స్థానాల్లో 140 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ 86 సీట్లలో ముందంజలో ఉంది. ఫలితాల్లో అనూహ్య మార్పులు వస్తే తప్ప.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బెంగాల్‌లో అధికారంలో మళ్లీ మమతకే దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    బెంగాల్‌లో తృణమూల్ హవా కనిపిస్తున్నా.. తాను బరిలోకి దిగిన నందిగ్రామ్ నియోజకవర్గంలో మాత్రం మమతా బెనర్జీ వెనుకంజలో ఉండటం గమనార్హం. తృణమూల్ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ.. ఇక్కడ మాత్రం పైచేయి సాధించలేకపోతున్నారని ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. ఇప్పటివరకు లెక్కించిన మెజార్టీ రౌండ్లలో మమతపై సువేందు ఆధిక్యత కనబరిచారు.
    Published by:Kishore Akkaladevi
    First published: