ASSEMBLY ELECTION RESULTS 2021 LIVE UPDATES VOTE COUNTING LATEST NEWS VIDHAN SABHA BJP CANDIDATE SUVENDU ADHIKARI IS IN LEADING THAN MAMATA BANERJEE VRY
Election Results 2021 Live Updates: నందిగ్రామ్ హట్‌టాపిక్, మమతా బెనర్జీ vs సువేందు అధికారి..
Assembly Election Results 2021 Live Updates: బెంగాల్ ఎన్నికలపై దేశవ్యాప్త ఉత్కంఠ నెలకోంది. ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ,సువేందు అధికారి మధ్య హోరా హోరీ కొనసాగుతుండడంతో అక్కడ ఏం జరగనుందనే ఉత్కంఠ చోటుచేసుకుంది
బెంగాల్ ఎన్నికలపై దేశవ్యాప్త ఉత్కంఠ నెలకోంది. ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ,సువేందు అధికారి మధ్య హోరా హోరీ కొనసాగుతుండడంతో అక్కడ ఏం జరగనుందనే ఉత్కంఠ చోటుచేసుకుంది.ప్రస్తుతం సువేందు అధికారి... మమతా బెనర్జీ కంటే 9000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి నుండి అంచనా వేసినట్టుగానే సువేందు అధికారి ముందంజలో కొనసాగుతున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టీఎంసీ హావా కొనసాగుతుంటే నందిగ్రామ్‌లో మాత్రం సీఎం మమతా బెనర్జీ వెనకంజలో ఉండడంతోనే నందీగ్రామ్ నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది.
అయితే సీఎం మమతాపై రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు ఉంటే నందిగ్రామ్ లో మాత్రం వ్యతిరేకత ఉందా లేదా బీజేపీ అభ్యర్థి అయిన సువేందు అధికారికి అనుకూలతా ? అనేది స్పష్టత రావాల్సి ఉంది..కాగా ఇక్కడ అభ్యర్థినా..పార్టీనా అనే కోణంలో పోరాటం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే సువేందు అధికారికి ఉన్న బ్యాక్ గ్రౌండ్‌తోపాటు సామాజిక నేపథ్యం లాంటీ పలు అంశాలు
ఆయనకు అనుకూలంగా ప్రభావితం చూపిస్తున్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీకి నమ్మిన బంటుగా ఉంటూ నందీగ్రామ్ పోరాటాల్లో సైతం తన సత్తాను చాటిన సువేందు అధికారి ముఖ్యంగా గత రెండు సార్లు ఎంపీగా పోటి చేసి గెలుపోందడంతో పాటు గత ఎన్నికల్లో టీఎంసీ తరుఫున పోటి చేసిన ఆయన సుమారు 80 వేల ఓట్ల ఆధిక్యతను సాధించారు.
మరోవైపు లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నందీగ్రామ్ పోరాటంలో మమత వెంట ఉన్న సువేందు అక్కడ పాగ వేశారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాలు ఉండడం ఆయనకు అనుకూలంగా ఓట్లు పడుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వంలో కాంగ్రెస్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడ చేసిన అనుభవం ఉండగా ఆయన కుటుంభం సైతం రాజకీయంగా అనుభవం ఉన్న పరిస్థితి నెలకొంది.