• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TIK TOK STAR BHARGAV RAPE CASE O MY GOD NITHYA GIVES CLARITY SHARES A VIDEO ON HER INSTAGRAM SR

Tik Tok Star Bhargav : భార్గవ్ రేప్‌‌ కేసుతో ఉన్న సంబంధంపై స్పష్టతనిచ్చిన ఓ మై గాడ్ నిత్య..

Tik Tok Star Bhargav : భార్గవ్ రేప్‌‌ కేసుతో ఉన్న సంబంధంపై స్పష్టతనిచ్చిన ఓ మై గాడ్ నిత్య..

Omg Nithya and Bhargav Photo : Instagram

Tik Tok Star Bhargav : మైనర్‌ బాలిక అత్యాచార కేసులో సోషల్ మీడియా స్టార్ టిక్‌టాక్‌ ఫేమ్ ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ని ఏపీ దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

  • Share this:
    మైనర్‌ బాలిక అత్యాచార కేసులో సోషల్ మీడియా స్టార్ టిక్‌టాక్‌ ఫేమ్ ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ని ఏపీ దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా స్టార్ భార్గవ్ 14 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేసాడని.. దీంతో ఈ కేసులో భార్గవ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే టిక్ స్టార్ భార్గవ్‌ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనగానే.. సోషల్ మీడియాను ఫాలో అవుతున్న చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’పేరును తీసుకొచ్చారు. అంతేకాదు భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడ్డది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా పేర్కోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఓ మై గాడ్ నిత్య తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. భార్గవ్‌కు నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని పేర్కోంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. భార్గవ్‌తో మాట్లాడి చాలా రోజులైందని.. ఫోన్‌లో కూడా మాట్లాడడం లేదని పేర్కోంది.

    భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యిందని.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడని.. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదని.. తెలుపుతూ మేం హైదరాబాద్‌‌లో ఉంటున్నామని తన మదర్‌తో కలిపి ఆ వీడియోలో స్పష్టతనిచ్చింది.








    View this post on Instagram






    A post shared by Nithyasri (@omggirlnitya)





    ఆమె ఇంకా మాట్లాడుతూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు తన ఫోటోను వాడారని.. ఏదో తెలియక పొరపాటున వాడుంటారని.. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను.. కనుక ఆ ఫోటోస్, మీమ్స్ వంటివి చేయకూడదని..  ఇప్పటికే చేసిన వాటిని దయచేసి డిలిట్ చేయాలనీ కోరింది. గతంలో భార్గవ్, నిత్య కలిసి పలు షార్ట్ వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. వీరు చేసిన వాటిలో కొన్ని సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అయ్యాయి.
    Published by:Suresh Rachamalla
    First published: