MALAYALAM TV STAR AMBILI DEVI SHOCKING COMMENTS ON HER HUSBAND ADITHYAN JAYAN SRD
Ambili Devi : నా భర్త నన్ను మోసం చేశాడు..వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు..నటి ఆవేదన..
అంబిలి దేవి - ఆదిత్య జయన్ (Photo Credit : Instagram)
Ambili Devi : నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వనివారు వివాహేతర సంబంధాల వలలో చిక్కుకుంటారు. ఇలాంటివి సరదాలు, సంతోషాలతో ప్రారంభమై విభేదాలు, విషాదంతో ముగుస్తాయి. తాజాగా ఓ బుల్లితెర జంట వివాహం విఛ్చిన్నమవటానికి సిద్దంగా ఉంది.
ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ ఇచ్చేవారు తగ్గిపోతున్నారు. కారణాలు ఏవైనా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ తాత్కాలిక బంధాలు. సరదాలు, వ్యామోహం వంటివి ఇలాంటి ప్రమాదకరమైన బంధాలకు దారితీస్తాయి. నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వనివారు వివాహేతర సంబంధాల వలలో చిక్కుకుంటారు. ఇలాంటివి సరదాలు, సంతోషాలతో ప్రారంభమై విభేదాలు, విషాదంతో ముగుస్తాయి. తాజాగా ఓ బుల్లితెర జంట వివాహం విఛ్చిన్నమవటానికి సిద్దంగా ఉంది. ఆమె భర్త వేరే మహిళతో ఉంటున్నాడని ఆ నటుడు భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపణ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మలయాళ బుల్లితెర జంట అంబిలి దేవి, ఆదిత్యల వివాహం అప్పట్లో సెన్సేషన్. మూడు పెళ్లిళ్ల తర్వాత ఆదిత్య, మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి అంబిలి.. ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఈ మధ్యన వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై అంబిలి దేవి స్పందిస్తూ.. తానిప్పటికీ ఆదిత్య భార్యగానే బతుకుతున్నానని చెప్పింది. అయితే మరిన్ని విషయాలు రివీల్ చేసింది.
అంబిలి మాట్లాడుతూ." జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని అతడిని రెండో పెళ్లి చేసుకున్నా. నేను ప్రెగ్నెంట్ అయ్యేవరకు మా జీవితం సంతోషంగా సాగింది. బెడ్ రెస్ట్ వల్ల నటనకు బ్రేక్ కూడా చెప్పా . ఈ లోగా లాక్‌డౌన్ వచ్చిపడింది. ఆ సమయంలో నా భర్త 13 ఏళ్ల కొడుకున్న మహిళతో రిలేషన్‌లో ఉన్నాడని అర్దమైంది. మొదట్లో నేను నమ్మలేదు. నా భర్త అలాంటివాడు కాదని బలంగా అనుకున్నాను. తెలిసినవాళ్లు నాకు ఫోన్లు చేసి ఆమె గర్భం దాల్చింది అని చెప్తే దాన్ని కొట్టిపారేశాను. కానీ కొద్ది రోజులుకు అవి రూమర్స్ కావు నిజమే అని తెలిసింది. ఏం చేయాలో అర్దం కాలేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.
" ఇదే విషయాన్ని నిలదీస్తే అతడు విడాకులు కోరుతున్నాడు. నాకు విడాకులు అక్కర్లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, కలిసే ఉందాం అని చెప్పినా ఒప్పుకోవటం లేదు. కానీ అతడు రిలేషన్ పెట్టుకున్న మహిళే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆదిత్య ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయాడో అర్థం కావట్లేదు. నన్ను లెక్కచేయట్లేదు" అని అంబిలి వాపోయింది. అంబలి దేవీ అనేక మలయాళీ సీరియళ్లలో నటించింది. కేరళలో ఈమె పెద్ద ఫేమస్. ఆదిత్య కూడా టీవి సీరియళ్లలో నటిస్తాడు. మరి ఈ జంట జీవితం ఏ మలుపు తిరగనుందో చూడాలి.