ఢిల్లీకి రాజైనా.. తల్లికి మాత్రం కొడుకే అనే సామెత తెలుసు కదా..? ఇది అందరికీ వర్తిస్తుంది. బయట ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఒక్కసారి ఇంటికి వచ్చి పిల్లల ముందు వాలిపోయారంటే వాళ్ల స్థాయి మరిచిపోవాల్సిందే.. పిల్లల్లో పిల్లలుగా కలిసిపోవాల్సిందే. వాళ్లతో పాటు పెద్దలు కూడా పిల్లలైపోవాల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే చేస్తున్నాడు. బయట ఈయన పెద్ద ఐకాన్ స్టార్ అయ్యుండొచ్చు కానీ ఇంట్లో మాత్రం చిన్న పిల్లోడే. 100 కోట్ల మార్కెట్ ఉండొచ్చు కానీ కూతురు చేతిలో మాత్రం ఆట వస్తువే. తాజాగా కూతురు అర్హతో అల్లు అర్జున్ ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లేకపోతే హాయిగా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటాడు బన్నీ. ఈయన మాదిరే చాలా మంది హీరోలు కూడా ఇదే చేస్తుంటారు. ఎప్పుడు సమయం దొరికినా కూడా ఇంట్లో పిల్లలతో గడుపుతుంటారు. పైగా ఏడాది కాలంగా కరోనా పుణ్యమా అని చాలా మంది హీరోలు ఇంటికే పరిమితం అయిపోయారు. మధ్యలో కొన్ని రోజులు పరిస్థితులు చక్కబడినట్లు అనిపించినా కూడా ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ వైరస్ విజృంభిస్తుంది.
అందుకే మరోసారి పిల్లలతో బిజీ అయిపోయారు హీరోలు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే చేస్తున్నాడు. తన ముద్దుల కూతురు అర్హతో ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా వేసారు.
కరోనా కారణంగా ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే కరోనా కారణంగా ఈ యూనిట్‌లో ఒకరు మరణించడంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. షూట్ లేకపోవడంతో తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు అల్లు అర్జున్. తాజాగా పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోలను కూడా బన్నీ భార్య అల్లు స్నేహా షేర్ చేసింది. కోట్లు సంపాదించినా కూడా రాని ఆనందం ఓ కూతురుతో తండ్రి ఆడుకుంటున్నపుడు వస్తుంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కరోనా సెకండ్ వేవ్‌కు కొన్ని రోజుల ముందు పెళ్లి రోజు సందర్భంగా తన భార్య పిల్లలతో కలిసి మాల్దీవ్స్ కూడా వెళ్లొచ్చాడు బన్నీ. ఆ ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.