• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ICON STAR ALLU ARJUN ANOTHER RECORD IN SOCIAL MEDIA PLATFORM INSTAGRAM TA

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. హ్యాపీగా ఫీలవుతున్న ఫ్యాన్స్..

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. హ్యాపీగా ఫీలవుతున్న ఫ్యాన్స్..

Allu Arjun pushpa

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. హ్యాపీగా ఫీలవుతున్న ఫ్యాన్స్.. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ నుంచి ఇపుడు ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఖాతాలో ఇపుడు మరో రికార్డు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. హ్యాపీగా ఫీలవుతున్న ఫ్యాన్స్.. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ నుంచి ఇపుడు ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఖాతాలో ఇపుడు మరో రికార్డు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే.. హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి ‘అల వైకుంఠపురుములో ’ చేసే ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని ఆవిష్కరించారు అల్లు అర్జున్. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్స్‌‌ను బీట్ చేసాడు. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు ‘బుట్టబొమ్మ, రాములో రాములో పాటలతో రికార్డుల మీద  రికార్డులు నెలకొల్పాడు. ఇపుడు సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నాడు. దాదాపు 18 యేళ్ల కెరీర్‌లో అల్లు అర్జున్ ఇపుడు సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్నాడు.

    తాజాగా సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ దాటింది. తెలుగుతో పాటు సౌతిండియాలో ఈ రికార్డు అందుకున్న రెండో హీరోగా నిలిచారు.

    అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ (Instagram/Photo)


    గతంలో 12 మిలియన్ వ్యూస్‌తో విజయ్ దేవరకొండ తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు. ఇపుడు సౌతిండియాలో రెండో హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. త్వరలో బన్ని నెంబర్ వన్ స్టానానికి వచ్చిన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. రీసెంట్‌గా అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు