• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • FREE CORONA VACCINE TO CINE WORKERS SAYS CHIRANJEEVI HERE ARE THE DETAILS SR

Chiranjeevi : మరోసారి అండగా నిలిచిన చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచిత కరోనా వ్యాక్సిన్..

Chiranjeevi : మరోసారి అండగా నిలిచిన చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచిత కరోనా వ్యాక్సిన్..

చిరంజీవి Photo : Twitter

Chiranjeevi : దేశంలో కరోనా సెకండ్ కారణంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు.

  • Share this:
    దేశంలో కరోనా సెకండ్ కారణంగా కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. అంతేకాదు రేపటి నుంచి థియేటర్స్ కూడా బంద్. అత్యవసరమైతే కానీ సినిమా షూటింగ్ జరపవద్దనీ సినీ నిర్మాతలు నిర్ణయించారు. దీనికి తోడు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు.. సామాన్యులు కూడా కరోనా భారీన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ముందుకు వచ్చాడు. ఇండస్ట్రీకి చెందిన అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని.. అపోలో సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నాడు. గతంలో కూడా చిరంజీవి కరోనా క్రైసిస్ పేరిట ఓ ఛారిటీ ఏర్పాటు చేసి అవసరమున్న వారికి కావాల్సిన సరుకులను అందించిండం.. మెడిసిన్స్ ఇలా వారికి తోడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కరోనా టీకాలను అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ వీడియోలో తెలిపాడు.


    ఈ కార్యక్రమం ఈ గురువారం నుంచి మొదలై.. ఓ నెల రోజుల పాటు ఈ కొనసాగుతుందన్నాడు. సినీ ఇండస్ట్రీలో 45 సంవత్సరాలు దాటిన వారితో పాటు వాళ్ల జీవిత భాగస్వామి కూడా 45 సంవత్సరాలు దాటి ఉంటే ఈ కరోనా టీకాను ఉచితంగా పొందవచ్చని పేర్కోన్నాడు. ఇక కరోనా టీకా కోసం అర్హులైన వారు తమ అసోసియేషన్లు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపాడు.
    Published by:Suresh Rachamalla
    First published: