• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • CHINMAYI SRIPADA COMMENTS ABOUT BLOOD DONATION AFTER COVID VACCINE NR

Chinmayi: వ్యాక్సిన్ వేసుకున్నాక బ్లెడ్ డొనేట్ చెయ్యచ్చా? చిన్మయ్ ఏం చెప్తుందంటే?

Chinmayi: వ్యాక్సిన్ వేసుకున్నాక బ్లెడ్ డొనేట్ చెయ్యచ్చా? చిన్మయ్ ఏం చెప్తుందంటే?

singer chinmayi

Chinmayi: టాలీవుడ్, కోలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద పరిచయం అందరికీ తెలిసిందే. తన అందమైన స్వరంతో ఎన్నో పాటలు పాడిన చిన్మయి ఓ పాపులారిటీని సంపాదించుకుంది.

  • Share this:
    Chinmayi: టాలీవుడ్, కోలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద పరిచయం అందరికీ తెలిసిందే. తన అందమైన స్వరంతో ఎన్నో పాటలు పాడిన చిన్మయి ఓ పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ముక్కుసూటి అమ్మాయిగా తనకు పేరు కూడా ఉంది. సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

    సమాజంలో జరిగే వాటిపై బాగా రియాక్ట్ అవుతుంది చిన్మయి. మహిళల భద్రత గురించి ఎన్నో విషయాలు పంచుకుంటుంది. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా నెటిజనులకు సలహాలు ఇస్తుంది. ఇక తాజాగా మరో విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

    మీటూ ఉద్యమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సినేషన్ తర్వాత బ్లడ్ డొనేషన్ గురించి అందరికీ సింపుల్ గా తెలిపింది. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత 56 రోజుల వరకు బ్లడ్ డొనేట్ చేయరాదని.. దాని వల్ల ముందు ముందు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ అందుబాటులో లేకుండా పోతుందని తెలిపింది. కాబట్టి వ్యాక్సినేషన్ కు ముందే బ్లడ్ డొనేట్ చేయాలని నెటిజనులతో పంచుకుంది. ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




    కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ నుండి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు సోషల్ మీడియా వేదికగా పలు జాగ్రత్తలు తెలుపుతున్నారు. అంతేకాకుండా బాధితులకు సహాయం చేయడానికి ఇప్పటికే పలువురు నటీనటులు ముందుకు వస్తున్నారు. రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఆసక్తికర విషయాల తో ముందుకు వస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: