• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS CONTESTANT HARI TEJA HOT COMMENTS HER LOVE STORY NR

Actress Hari Teja: భర్తను ప్రేమించాల్సి వచ్చింది అంటూ తన పెళ్లి గురించి వైరల్ కామెంట్స్ చేసిన హరితేజ..?

Actress Hari Teja: భర్తను ప్రేమించాల్సి వచ్చింది అంటూ తన పెళ్లి గురించి వైరల్ కామెంట్స్ చేసిన హరితేజ..?

Actress Hari Teja

Actress Hari Teja: బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.

  • Share this:
    Actress Hari Teja: బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ. 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.. ఆ తర్వాత తన నటనకు ఎన్నో అవకాశాలు అందుకుంది.

    ఇక 2011లో బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.. దాదాపు ఏడు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది. ఇక 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కూడా నటించింది హరితేజ.

    ఇక ఆమె 2015 లో దీపక్ ను వివాహమాడగా.. ఇటీవలే తను పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.. తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది. అంతే కాకుండా తన సీమంతం ఫోటోలను కూడా షేర్ చేయడమే కాకుండా తను డెలివరీ సమయంలో ఎదురుకున్న కరోనా సమస్యల గురించి కూడా తెలిపి అందర్నీ ఎమోషన్ చేసింది.

    ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కాసేపు తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఇక పలువురు కొన్ని విషయాల గురించి ప్రశ్నించగా.. అందులో ఓ నెటిజన్ మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ ముందు ఆయన ప్రేమించారు.. ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఇక ఇంట్లో వాళ్లకి ఆప్షన్ ఏముంది అంటూ.. బ్రహ్మానందం స్టైల్ లో డైలాగ్ చెప్పింది.
    Published by:Navya Reddy
    First published:

    అగ్ర కథనాలు