• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANUPAMA PARAMESWARAN SAYS SORRY TO PAWAN KALYAN FANS FOR THIS REASON HERE ARE THE DETAILS SR

Anupama Parameswaran : పవన్ కళ్యాణ్‌పై అనుపమ ట్వీట్.. ఫ్యాన్స్ ఆగ్రహం.. క్షమాపణ కోరుతూ..

Anupama Parameswaran : పవన్ కళ్యాణ్‌పై అనుపమ ట్వీట్.. ఫ్యాన్స్ ఆగ్రహం.. క్షమాపణ కోరుతూ..

Anupama Instagram

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది.

  • Share this:
    Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. 'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ కుట్టి. ఇక అది అలా ఉంటే అనుపమ పవన్ కళ్యాణ్‌‌ను ఉద్దేశించే ఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యణ్ తాజాగా నటించిన చిత్రం 'వకీల్‌సాబ్'. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో చూసిన హీరోయిన్ అనుపమ.. ఆ సినిమాపై చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో అందిరిని మెచ్చుకుంటూ నివేదా థామస్, అంజలి, అనన్యాలు అదరగొట్టారని తెలిపింది. ఇక నటుడు ప్రకాష్‌రాజ్‌ను 'సార్‌' అని సంభోదించిన అనుపమ.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం ట్విట్టర్ ఐడీకే పరిమితం చేసింది. దీంతో రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో.. అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ షురూ చేశారు. అరే.. మిస్టేక్ జరిగిందే అని గమనించిన అనుపమ.. తను రియలైజ్ అయినట్లుగా పేర్కోంటూ సారీ చెప్పింది. మరోక ట్వీట్‌లో రాస్తూ.. 'పవన్ కళ్యణ్ గారు'.. అంటే ఎంతో గౌరవం, ప్రేమ అని తెలిపింది. దీంతో పవన్ అభిమానులు శాంతించారు.

    ఇక ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ మరో విశేషం ఏమంటే.. నివేదా థామస్ చేసిన పాత్ర మొదట అనుపమకే వచ్చిందని టాక్. అయితే ఆమె ఆ ఆఫర్‌ను ఏవో కారణాల వల్ల రిజెక్ట్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.



    అనుపమ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ ప్రస్తుతం దిల్‌ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘రౌడీ బాయ్స్‌’ పేరు పెట్టింది చిత్రబృందం. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘రౌడీ బాయ్స్‌’ చిత్రాన్ని జూన్‌ 25న విడుదల చేస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: