• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • BURNT WINE COGNAC HOW TO MAKE COGNAC WINE HERE IS THE HISTORY OF COGNAC WINE MAKING NK GH

Burnt wine cognac: కాగ్నాక్ వైన్ అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఏంటి స్పెషల్‌?

Burnt wine cognac: కాగ్నాక్ వైన్ అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఏంటి స్పెషల్‌?

కాగ్నాక్ వైన్ అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఏంటి స్పెషల్‌? (ప్రతీకాత్మక చిత్రం)

Burnt wine cognac: వైన్స్‌లో చాలా రకాలున్నాయి. వాటిలో కాగ్నాక్ వైన్ ప్రత్యేకమైనది. దానికి ప్రపంచవ్యాప్తంగా లవర్స్ ఉన్నారు. ఆ వైన్ ఎలా తయారుచేస్తారో... పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
Burnt wine cognac: కాగ్నాక్‌గా పాపులర్‌ అయిన వైన్ డ్రింక్‌ పురాతనమైనదని కూడా. మద్యం తయారీలో ఇదే మొదటిది కాదు. దీని కంటే ముందు నుంచే మద్యం తయారుచేసేవారు. తొలినాళ్లలో భారత్‌, ఈజిప్ట్‌లో బంగారం కోసం లెడ్‌ (సీసం)ను కరిగించేవారు. దీని కోసం రకరకాల ద్రావణాలు వాడేవారు. ఈ విధానాన్ని గమనించిన ఆల్కెమిస్ట్‌లు ప్రకృతి మూలికల్లోని సారాన్ని తీసి... చిక్కటి ద్రావణం తయారు చేశారు. దీని కోసం వారు పళ్లు, పువ్వులు, వేళ్లు ప్రకృతి సిద్ధ ఉత్పత్తులను ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వాటి నుంచి సువాసన వస్తుండటాన్ని గమనించారు. అంతేకాకుండా ఆ ద్రావణం చికిత్సలకు కూడా ఉపయోగపడుతుందని అనుకున్నారు. ఇలా ప్రకృతి మూలికలను కరిగించి ద్రావణాలు తయారు చేసే క్రమంలోనే మద్యం పుట్టుకొచ్చిందట. ఈ విధానంలో తయారైన మద్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చని గమనించారు. మద్యం తయారీ గురించి తొలుతగా తెలిసింది అప్పుడే అంటారు. అయితే తొలుత ఈ ఆల్కహాల్‌ను సేవించడానికి కాకుండా... టింక్చర్ల తయారీకి వినియోగించేవారట.

కాగ్నాక్ తయారీలో రెండు అంచెలు ఉంటాయి. కాగ్నాక్‌ను తయారు చెయ్యడానికి వైట్‌ వైన్‌ అవసరం. ఉగ్నీ బ్లాక్‌, ఫోలీ బ్లాంచ్‌, కోలోంబార్డ్‌ లాంటి ప్రత్యేక ద్రాక్ష పళ్లతో ఈ వైట్‌ వైన్‌ను రూపొందిస్తారు. వీటిలో ఆల్కహాల్‌ శాతం తక్కువగా ఉంటుంది. అలాగే పులుపు ఎక్కువగా ఉంటుంది. అయితే వీటితోనే కాగ్నాక్ తయారు చేయొచ్చని ఆ రోజుల్లో గుర్తించారు. డిస్టిలేషన్‌ ప్రక్రియలో ఆల్కహాల్‌ చిక్కనైన ద్రావణంగా మారిపోతుంది. ఈ క్రమంలో అందులోని పులుపు కాస్తా, చక్కటి రుచిగా మారుతుంది. కాగ్నాక్ నాణ్యత ద్రాక్షలోనే కాకుండా, అది పండిన ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటుంది. గ్రాండ్‌ అండ్‌ పెటైట్‌ షాంపెయిన్‌లో చక్కటి ఫ్లోరల్‌ స్పిరిట్‌ రూపొందుతుందట. ద్రాక్ష పళ్లకు చక్కటి సువాసన, టెక్స్చర్‌ రావాలంటే ఈ స్పిరిట్‌ వల్లే సాధ్యం. ఫిన్‌ బోయిస్‌, బోయిస్‌ ఆర్డినైర్‌లో తయారయ్యే స్పిరిట్‌ చాలా బాగుంటుంది. వీటిని కాగ్నాక్ తయారీలో ఎక్కువగా వాడుతారు.

ఇది కూడా చదవండి: Hair Growth Tips: ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు

కాగ్నాక్ తయారీ కోసం ఇప్పటికీ చారెన్‌టెయిస్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. ఇది పెద్ద రాగి పాత్రను పోలి ఉంటుంది. తయారీ సంగతి చూస్తే... ముందుగా వైన్‌ను కాపర్‌ ఛాంబర్‌లోకి పంపిస్తారు. అందులో వైన్‌ మరిగి ఆవిరిగా మారుతుంది. ఆ తర్వాత ఆ ఆవిరి ఒంపు తిరిగిన ట్యూబ్‌ ద్వారా ప్రయాణించి కాయిల్డ్‌ సెక్షన్‌ ట్యూబ్స్‌లోకి వెళ్తుంది. ఈ కాయిల్డ్‌ పైప్‌.. ఓ కంటైనర్‌లో ఉంటుంది. అందులో బ్రాయిలర్‌లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వైన్‌ ఉంటుంది. ఆ తర్వాత ఆ పైపు వైపుగా వేడి వాయువు ప్రసరిస్తుంది. అప్పుడు వైన్‌ వేడెక్కుతుంది. ఆ తర్వాత చల్లబడి ద్రావణ స్థితిలోకి తీసుకొస్తుంది. ఈ ద్రావణాన్ని మరోసారి డిస్టిల్‌ చేస్తే స్పిరిట్‌ సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియలో తొలుత ఉత్పత్తి అయ్యే ద్రావణం, ఆఖరున వచ్చే ద్రావణం భద్రపరచడానికి అనువుగా ఉండవు. ఆ మధ్యలో వచ్చే ద్రావణాన్ని బ్యారెల్స్‌‌లో నింపి, సరఫరా చేస్తుంటారు. అదే కాగ్నాక్.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు