TELANGANA GOVERNMENT RELEASED JOBS NOTIFICATIONS FOR VACANCIES IN WARANGAL KMC AND ADILABAD RIMS NS
Telangana Jobs: ఆ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విభాగంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చంది. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకతీయ మెడికల్ కాలేజీ కి అనుబంధంగా ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, ఆదిలాబాద్ లోని రిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. ఈ రెండు ఆస్పత్రుల్లో మొత్తం 74 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కాకతీయ మెడికల్ కాలేజీ(KMC), రాజీవ్ గాంధీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS) అసిస్టెంట్ ప్రొఫేసర్ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1. 25 లక్షల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. కేఎంసీ, వరంగల్ లో చేరడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో చేరడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27న గురువారం ఉదయం 10. 30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనల్లో అధికారులు పేర్కొన్నారు. NMDC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NMDCలో డిగ్రీ, డిప్లొమో, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగానే ఎంపిక Railway Recruitment 2021: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. పూర్తి వివరాలివే
ఖాళీల వివరాలు..
ఆదిలాబాద్ లోని రిమ్స్ లో మొత్తం 36 ఖాళీలు ఉండగా.. కేఎంసీలో 38 ఖాళీలు ఉన్నాయి. రిమ్స్ లో కార్డియాలజీ విభాగంలో 4, కార్డియోథొరాసిక్ సర్జన్ విభాగంలో 2, నెఫ్రాలజీ విభాగంలో 2, యూరాలజీ విభాగంలో 2, న్యూరో సర్జరీ విభాగంలో 2, పిడియాట్రిక్ సర్జరీ విభాగంలో 2, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో 2, మెడికల్ ఆంకాలజీ విభాగంలో 2, రెడియాలజీ విభాగంలో 2, ఆనస్థీషియాలజీ విభాగంలో 14 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. RIMS Notification - Direct Link KMC Notification - Direct Link
-కాకతీయ మెడికల్ కాలేజీలో కార్డియాలజీ విభాగంలో 4, కార్డియోథొరాసిక్ సర్జన్ విభాగంలో 2, నెఫ్రాలజీ విభాగంలో 2, యూరాలజీ విభాగంలో 2, న్యూరాలజీ విభాగంలో 2, పిడియాట్రిక్ సర్జరీ విభాగంలో 2, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 2, మెడికల్ అంకాలజీ విభాగంలో 2, రేడియాలజీ విభాగంలో 2, అనస్థీషియాలజీ విభాగంలో 16 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో పీజీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Telangana Jobs: ఆ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే
Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు
India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? రిజల్ట్ ఎప్పుడంటే
CBSE 12th board Exams 2021: జూలైలో సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు? త్వరలో అధికారిక ప్రకటన.. వివరాలివే
Railway Recruitment 2021: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. పూర్తి వివరాలివే