• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NBEMS RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR JUNIOR ASSISTANT SENIOR ASSISTANT AND OTHER POSTS NS GH

NBEMS Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

NBEMS Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో వైద్య రంగంలో నియమకాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Share this:
కరోనా కారణంగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, తిరిగి వేగం పుంజుకుంటోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోన్న స్వతంత్ర సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ (NBEMS), దీనికి సంబంధించిన ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. NBEMS రిక్రూట్‌మెంట్ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ జులై 15 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు natboard.edu.in పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ ఆగస్టు 14. ఈ నియామక ప్రక్రియలో కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) సెప్టెంబరు 20న జరుగుతుంది. పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలను దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తరువాత వెల్లడించనున్నారు. అడ్మిట్ కార్డును అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే

ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
మొత్తం 42 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్-30, సీనియర్ అసిస్టెంట్- 08, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు- 4 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత:
సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ అసిస్టెంట్‌కు.. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. విండోస్ లేదా నెట్‌వర్క్ ఆపరేటింగ్‌కు సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు బేసిక్ సాఫ్ట్ వేర్ ప్యాకేజీల గురించి అవగాహన ఉండాలి.

జూనియర్ అకౌంటెంట్ పోస్టుకు.. గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి మ్యాథ్స్ లేదా స్టాటిక్స్ లేదా కామర్స్ లో డిగ్రీ చేసి ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ బేస్డ్ అకౌంటింగ్ పరిజ్ఞానం ఉన్న కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు www.natboard.edu.in వెబ్‌సైట్‌లో, జులై 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. అందుబాటులో ఉన్న లింక్ ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో అప్లికేషన్ సమర్పించాలి. దీంతోపాటు అర్హత, పని అనుభవానికి సంబంధించిన పత్రాలను సైతం అప్ లోడ్ చేయాలి. చివరి నిమిషంలో హడావిడిగా అప్లికేషన్ నింపడానికి బదులుగా, ముందే ఆన్ లైన్‌లో అప్లై చేసుకుంటే మంచిది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు